BIG BREAKING : కాక్రోచ్ చీఫ్ పై దాడి..  చెంపపై కొట్టి పరార్- VIDEO VIRAL

కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై కొందరు గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై తెగబడ్డారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయన తన మద్దతుదారులతో కలిసి శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుండగా ఈ ఘోరం జరిగింది.

New Update
abajit

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో తీవ్ర కలకలం రేగింది. కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై కొందరు గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై తెగబడ్డారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయన తన మద్దతుదారులతో కలిసి శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుండగా ఈ ఘోరం జరిగింది. నిరసన ప్రదర్శనలో ఒక్కసారిగా దూసుకొచ్చిన ఒక యువకుడు అభిజీత్ దీప్కేపై దాడి చేసి, అందరూ చూస్తుండగానే ఆయనను పదేపదే చెంపదెబ్బలు కొట్టడం అక్కడ తీవ్ర గందరగోళానికి దారితీసింది.

జైపూర్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత అభిజీత్ దీప్కే ఆందోళన జరుగుతున్న వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయన లోపలికి ప్రవేశిస్తున్న సమయంలోనే ఊహించని పరిణామం ఎదురైంది. గుంపులో నుంచి వచ్చిన ఓ గుర్తుతెలియని యువకుడు ఒక్కసారిగా అభిజీత్‌పై విరుచుకుపడి, చెంపలపై బలంగా కొట్టాడు. ఆ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీన్ని చూసి షాక్‌కు గురైన దీప్కే అనుచరులు, పార్టీ కార్యకర్తలు సదరు యువకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వాడు దొరకకుండా పరారయ్యాడు.

ఉద్రిక్త వాతావరణం

ఈ దాడి ఘటనతో ఆందోళన స్థలంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ నాయకుడిపై దాడి జరగడంతో కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అయితే, పరిస్థితి చేజారకుండా ఉండేందుకు అభిజీత్ దీప్కే వెంటనే చొరవ తీసుకుని, కార్యకర్తలు ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, అందరూ శాంతిని పాటించాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారైన సదరు దుండగుడి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. రాజకీయ నిరసనల్లో ఇలాంటి దాడులు జరగడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.

Advertisment
తాజా కథనాలు