కాంగ్రెస్ కొంప ముంచిన AAP.. ఆ ఒక్క శాతం ఓట్లు వచ్చుంటే?

హర్యానాలో ఆప్ కారణంగానే కాంగ్రెస్‌ అత్యల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. బీజేపీకి 39.94, కాంగ్రెస్‌కు 39.09, ఆమ్ ఆద్మీకి 1.79 శాతం ఓట్లు లభించాయి. దీని ఆధారంగా కాంగ్రెస్‌తో ఆప్ పొత్తుపెట్టుకుంటే ఓట్లు చీలేవి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

New Update
cgdtb rt

Haryana: ఆసక్తికరంగా సాగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోరులో బీజేపీ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మొత్తం 90 స్థానాలకు గానూ 48 స్థానాల్లో గెలిచి మరోసారి అధికారం చేజిక్కించుకుంది. గెలుపు నల్లేరుమీద నడకే అనుకున్న కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ కేవలం 37 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే పొత్తుల అంశం చర్చనీయాంశమైంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్.. హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించలేదు. ఒంటరిగానే బరిలోకి దిగిన ఆప్ కనీసం ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయినా ఓట్లు మాత్రం చీల్చింది.  

పెద్దగా ప్రభావం చూపదని భావించినా..

ఈ ఎన్నికల్లో బీజేపీకి 39.94 శాతం ఓట్లు లభించగా.. ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ కు 39.09 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో మరో ఒక్క శాతం ఓట్లు అటుఇటైతే ఫలితాలు వేరేలా ఉండేవన్న విశ్లేషణ రాజకీయవర్గాల్లో సాగుతోంది. పెద్దగా ప్రభావం చూపదని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీకి 1.79 శాతం ఓట్లు దక్కాయి. అయితే కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే ఈ ఒక్కశాతం ఒట్లు ఎన్నికలపై ప్రభావం చూపించేవి. దాదాపు 9 బీజేపీ అభ్యర్థులు కేవలం 2వేల స్వల్ప తేడా ఓట్లతో గెలుపొందారు. ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఆప్.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఓట్లు చీలకుండా హర్యానా హస్తగతమయ్యేదని స్పష్టంగా అర్థమవుతోంది.  

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఫుల్ ఖుష్‌ అయ్యారు. ప్రధాని మోడీ నేతృత్వంలో హర్యానాలో ఘన విజయం సాధించామని అన్నారు. హర్యానా ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అబద్ధాలను ప్రచారం చేసిందని, అయినప్పటికి హర్యానా ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్‌ విజయాన్ని కట్టబెట్టారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పుకొచ్చారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు