/rtv/media/media_files/2026/03/18/ev-charging-point-2026-03-18-21-37-33.jpg)
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం బుధవారం సంభవించిన ఒక భీకర అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడింది. బెంగాలీ స్క్వేర్ సమీపంలోని బ్రజేశ్వరి అనెక్స్ కాలనీలో జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ పెట్టిన సమయంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ ఈ పెను విషాదానికి కారణమైంది.
How did 7 people die in #Indore#MadhyaPradesh?
— Siraj Noorani (@sirajnoorani) March 18, 2026
An electric vehicle (#EV) was being charged at the gate of businessman Manoj Pugalia's residence. A short circuit occurred at the charging point. Several gas cylinders and chemical drums were stored in the home's gallery.
1/3 https://t.co/Zoscznwns7pic.twitter.com/9Ui2Dgv8xp
వ్యాపారవేత్త మనోజ్ పుగాలియా తన ఇంటి బయట తన ఎలక్ట్రిక్ కారును (టాటా పంచ్) ఛార్జింగ్‌లో ఉంచారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఛార్జింగ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్ద పేలుడు సంభవించింది. క్షణాల్లో మంటలు కారుకు, ఆపై మూడు అంతస్తుల భవనానికి వ్యాపించాయి. ఇంట్లో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లు, ఏసీ కంప్రెసర్లు వరుసగా పేలడంతో మంటలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. సహాయక చర్యల సమయంలో ఎలక్ట్రానిక్ లాక్ సిస్టమ్ అతిపెద్ద అడ్డంకిగా మారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తలుపులు జామ్ అయిపోయాయి, దీంతో లోపల ఉన్నవారు బయటకు రాలేక ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని మరణించారు. అగ్నిమాపక సిబ్బంది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గతంలో కూడా ఇండోర్‌లో ఇలాగే ఎలక్ట్రానిక్ గేట్ల వల్ల ఓ పారిశ్రామికవేత్త ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
విషాదకర దృశ్యాలు
ఈ ప్రమాదంలో మనోజ్ పుగాలియా (65), విజయ్ సేథియా (65), సుమన్ సేథియా (60), టిను (35), సిమ్రాన్ (30 - గర్భిణీ), చోటు సేథియా (22), రాశి సేథియా (12), తన్మయ్ (6) మరణించారు. కుటుంబ వేడుక కోసం వచ్చిన బంధువులు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తిలక్ నగర్ ముక్తిధామ్‌లో ఒకేసారి ఏడు చితులు మండుతుండగా, ఆరేళ్ల చిన్నారిని ఖననం చేస్తున్న దృశ్యం అందరినీ కన్నీరు పెట్టించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.
ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు ఐఐటి నిపుణులు, ఫోరెన్సిక్ బృందాలతో ఉన్నత స్థాయి దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఈవీ ఛార్జింగ్ కోసం ప్రత్యేక మార్గదర్శకాలను (SOP) రూపొందించనున్నట్లు మంత్రి కైలాష్ విజయవర్గియా తెలిపారు. ఈ సంఘటన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ భద్రతపై, ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్స్ ప్రమాదాలపై తీవ్ర చర్చకు దారితీసింది.
Follow Us