/rtv/media/media_files/2026/03/27/srinagar-2026-03-27-21-17-45.jpg)
శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన ఘోర హిమపాతం తీవ్ర విషాదాన్ని నింపింది. జోజిలా కనుమ ప్రాంతంలోని జీరో పాయింట్, మినిమార్గ్ మధ్య వరుసగా విరుచుకుపడిన మంచు చరియల కింద దాదాపు డజను వాహనాలు చిక్కుకుపోవడంతో, ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
🚨Breaking-
— Chaudhary Parvez (@ChaudharyParvez) March 27, 2026
India- A small avalanche struck vehicles near Deyal Slade on the #Srinagar-#Ladakh National Highway at #Zojila Pass.
Police sources: 6 dead, 1 missing while 5 are injured. Most of the victims are Leh residents.#breaking#Avalanchepic.twitter.com/pUEVXrW8UN
ఈ ప్రకృతి విపత్తుపై సమాచారం అందుకున్న వెంటనే లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని ప్రకటించారు. సహాయక చర్యలను యుద్ధప్రతిపాదికన చేపట్టాలని ఆయన కార్గిల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించడంతో పాటు, విపత్తు నిర్వహణ దళాలు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) అధికారులను అప్రమత్తం చేశారు.
This evening, a massive avalanche struck Zoji La Pass, Srinagar–Leh Highway, Ladakh, India.
— Weather Monitor (@WeatherMonitors) March 27, 2026
According to the latest update, 7 have been killed and more are feared dead. pic.twitter.com/H1jnL3Pyqt
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుందని ఆయన ట్విట్టర్ వేదికగా భరోసా ఇచ్చారు.
Follow Us