/rtv/media/media_files/2025/03/30/6vCx9elBgk1n8Ax680ey.jpg)
Himachal Pradesh landslide
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లోనీ కులు లో కొండ చరియలు విరిగి పడి ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ కులులోని గురుద్వారా మణికరణ్ సాహిబ్ ఎదురుగా ఉన్న పిడబ్ల్యుడి రోడ్డు సమీపంలో ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన ఆరుగురిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ సంఘటనలో అనేక మంది గాయపడ్డారు.
Also Read: ''నెక్ట్స్ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్ చేసి బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్
కొండచరియలు, చెట్లు విరిగి వాహనాలపై పడడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని కులు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీచాయి. అదే సమయంలో అటు నుంచి వెళుతున్న వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద కొందరు స్థానికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు రెస్కూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. మృతుల గుర్తింపు వివరాలపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు పేర్కొన్నారు. వీరిని పర్యాటకులుగా గుర్తించినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
కులులోని ADM అశ్వనీ కుమార్ ప్రకారం, ఈ సంఘటనపై పోలీసులు,జిల్లా పరిపాలన సహాయక బృందాలు వెంటనే స్పందించాయి. గాయపడిన వారిని చికిత్స కోసం జారిలోని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం, మృతుల్లో రోడ్డు పక్కన ఉన్న ఒక వ్యాపారి, ఒక కారు రైడర్ మరియు అక్కడికక్కడే ఉన్న ముగ్గురు పర్యాటకులు ఉన్నారు. జారి నుండి అగ్నిమాపక శాఖ బృందం కూడా ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుంటోంది. మృతుల గుర్తింపులను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.
ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?