/rtv/media/media_files/2026/04/09/punjab-2026-04-09-08-16-58.jpg)
Punjab: పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం గ్యాంగ్‌స్టర్ల ఏరివేతే లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టింది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 501 చోట్ల మెరుపు దాడులు నిర్వహించి, ఏకంగా 202 మందిని అరెస్ట్ చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశాల మేరకు సాగుతున్న ఈ 'యాంటీ గ్యాంగ్‌స్టర్' వేట విజయవంతంగా 77వ రోజుకు చేరుకుందని ప్రభుత్వం ప్రకటించింది.
గ్యాంగ్‌స్టర్లకు సహకరిస్తున్న వారిని, వారి అనుచరులను ఏరిపారేయడానికి పోలీసులు పక్కా ప్లాన్‌తో దాడులు చేశారు. యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (AGTF) తో కలిసి అన్ని జిల్లాల పోలీసులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. కేవలం అరెస్టులే కాకుండా, తప్పించుకుని తిరుగుతున్న నేరగాళ్ల ఆచూకీ కోసం కూడా గాలింపు చేపట్టారు.
Also Read: అమెరికా vs ఇరాన్ .. యుద్ధం డిమాండ్స్ ఏంటి?
పంజాబ్ సర్కార్ యుద్ధం
గ్యాంగ్‌స్టర్లతో పాటు డ్రగ్స్ మాఫియాపై కూడా పంజాబ్ సర్కార్ యుద్ధం ప్రకటిస్తోంది. బుధవారం నాటి దాడుల్లో డ్రగ్స్ అమ్ముతున్న 112 మంది స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 5.8 కిలోల హెరాయిన్, భారీగా మత్తు మాత్రలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఈ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. నేరగాళ్లకు ఆర్థికంగా, సాంకేతికంగా సాయం చేస్తున్న వారిని కూడా వదలబోమని హెచ్చరించారు. వరుస దాడులతో పంజాబ్‌లో నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Also Read: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ టోకరా: లక్ష రూపాయలు మాయం
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటమే కాకుండా, పంజాబ్ యువతను పక్కదారి పట్టిస్తున్న గ్యాంగ్‌స్టర్ సంస్కృతికి చరమగీతం పాడటమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. నేరగాళ్లకు ఎక్కడా ఆశ్రయం దొరక్కుండా, వారి ఆర్థిక వనరులను దెబ్బతీస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వరుసగా 77 రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించడం, వేల సంఖ్యలో దాడులు చేయడం పంజాబ్ చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచింది. పంజాబ్ పోలీసుల ఈ దూకుడుతో నేరగాళ్లలో వణుకు మొదలైంది.
Follow Us