/rtv/media/media_files/2026/06/14/madhyapradesh-2026-06-14-19-07-36.jpg)
మధ్యప్రదేశ్‌లో ఒక ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కేవలం ఒక చిన్న పుకారు కారణంగా నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మోరెనా రైల్వే స్టేషన్ సమీపంలోని హేతంపూర్ దగ్గర ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
రైల్లో ఒక్కసారిగా వదంతులు
ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణిస్తున్న సమయంలో, అందులో మంటలు చెలరేగాయంటూ రైల్లో ఒక్కసారిగా వదంతులు వ్యాపించాయి. దీంతో బోగీల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవాలనే కంగారులో కొందరు ప్రయాణికులు వెంటనే రైలు చైన్ లాగి బండిని ఆపేశారు. రైలు ఆగీఆగడంతోనే భయంతో కిందకు దూకేశారు.
రైలు దిగిన ప్రయాణికులు ప్రాణభయంతో పక్కనే ఉన్న మరో రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ అదే సమయంలో పక్క పట్టాలపై నుండి పాతాళ్‌కోట ఎక్స్‌ప్రెస్ రైలు అత్యంత వేగంగా దూసుకొచ్చింది. పట్టాలు దాటుతున్న ప్రయాణికులను ఈ రైలు బలంగా ఢీకొట్టింది.
Madhya Pradesh: A train accident occurred in Morena after passengers travelling on the Udaipur Intercity Express jumped off the train following rumours of a fire. Several passengers were hit by the approaching Patalkot on the main track. The incident took place near Hetampur… pic.twitter.com/LfSX6R4XE8
— IANS (@ians_india) June 14, 2026
ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
Follow Us