/rtv/media/media_files/2026/03/10/marriage-2026-03-10-20-57-04.jpg)
సైనికులు కేవలం సరిహద్దుల్లోనే కాదు, మానవత్వంలోనూ తాము అందరికంటే ముందుంటామని మరోసారి నిరూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుక ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఒక అమర జవాను కుమార్తె పెళ్లిలో, అతని తోటి సైనిక సోదరులు తండ్రి పాత్రను పోషించి ఆమెను అత్తారింటికి పంపించారు. తన తండ్రి లేని లోటు తెలియకూడదని జవాన్లు చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
విధులు నిర్వహిస్తుండగా జరిగిన
బాగ్‌పత్ జిల్లా కాతా గ్రామానికి చెందిన హవల్దార్ హరేంద్ర సింగ్ భారత సైన్యంలోని 21 జాట్ రెజిమెంట్‌లో పనిచేశారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు. అప్పటి నుంచి ఆయన కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవిస్తోంది. తాజాగా హరేంద్ర సింగ్ కుమార్తె ప్రాచికి వివాహం నిశ్చయమైంది. తన తండ్రి రెజిమెంట్‌లో పనిచేసిన సైనికులకు కుటుంబ సభ్యులు ఆహ్వానం పంపగా, తమ తోటి జవాను కుమార్తెను సొంత బిడ్డలా సాగనంపాలని వారు నిర్ణయించుకున్నారు.
మార్చి 9న జరిగిన వివాహానికి 21 జాట్ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్లు, సుబేదార్లు ఇతర సైనికులు ప్రత్యేకంగా సెలవు తీసుకుని విచ్చేశారు. పెళ్లి వేడుకలో వారు చేసిన పని చూసి అతిథులంతా భావోద్వేగానికి లోనయ్యారు. ప్రాచిని పెళ్లి పీటల మీదకు తీసుకెళ్లే సమయంలో జవాన్లు తమ అరచేతులను నేలపై బాటగా పరిచారు. ఆ వీర సైనికుల అరచేతులపై నడుచుకుంటూ ప్రాచి జైమాల వేదికపైకి చేరుకుంది.
తండ్రి స్థానంలో ఉండి వారే కన్యాదానం నిర్వహించడమే కాకుండా, తమ జీతాల నుంచి పోగు చేసిన రూ. 6.50 లక్షల నగదును ఆమెకు కానుకగా అందజేశారు. విడ్కోలు సమయంలో సైనికులు కూడా కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారిని కదలించింది.
Follow Us