/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T083621.761-jpg.webp)
ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు బుల్లెట్ల వర్షం కురిపించాయి. మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోయారు. పామేడు, మద్దేడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
Also Read: Maha kumbh: మహా కుంభమేళాలో 'డిజిటల్ బాబా'..
జనవరి 16 ఉదయం 9గంటల నుంచి భద్రతా బలగాలు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ చేపట్టాయి. సెర్చ్ ఆపరేషన్ నడుస్తున్నండగా మావోయిస్టుల నుంచి కాల్పులు జరిగాయి. పోలీసులు ఎదురుకాల్పులు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు.
Also Read: USA: హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆపేస్తున్నాం..సడెన్‌గా ప్రకటించిన ఆండర్సన్