రష్యా ఆర్మీలో 12 మంది ఇండియన్స్ మృతి, 16 మంది మిస్సింగ్

రష్యా కోసం పోరాడుతున్న ఆర్మీలో 126 మంది భారతీయులు పని చేసినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వారిలో 12 మంది మరణించగా, 16 మంది తప్పిపోయారని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు తెలిపారు. 96 మంది సైనికులు ఇండియాకు తిరిగి వచ్చారు.

New Update
russian army

russian army Photograph: (russian army)

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య 2022 ఫిబ్రవరి 24 నుంచి భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో రష్యా కోసం పోరాడుతున్న ఆర్మీలో మొత్తం 126 మంది భారతీయులు పని చేసినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది.  వారిలో 12 మంది మరణించగా, 16 మంది భారతీయులు తప్పిపోయారని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ జనవరి 17న మీడియాకు తెలిపారు. 96 మంది సైనికులు ఇండియాకు తిరిగి వచ్చారని, ఇంకా 18 మంది భారత్‌కు తిరిగి రావాల్సి ఉందని ఆయన చెప్పారు.

ఇది కూడా చూడండి: ఖేల్ రత్న అవార్డ్‌లు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

ఉక్రెయిన్, రష్యా వార్‌లో ముందుండి పోరాడిన కేరళకు చెందిన సైనికుడు బినిల్ బాబు(32) మరణించిన విషయం తెలిసిందే. రష్యా గవర్నమెంట్‌తో అక్కడి రాయబారి కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. రష్యా ఆర్మీలో పని చేస్తున్న మిగిలిన భారతీయులను తద్వారా ఇండియాకు రప్పించేందేకు అధికారులతో  చర్చిస్తోంది. బినిల్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకొస్తామని MEA ప్రతినిధి తెలిపారు. రష్యాలో ఉన్న వారిని విడుదల చేసి స్వదేశానికి రప్పించాలని భారతదేశం కోరుతున్నట్లు MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం తెలిపారు.

ఇది కూడా చదవండి : Imran Khan: పాకిస్థాన్​ మాజీ ప్రధాని​కి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు