/rtv/media/media_files/2025/01/21/f0NIbUL9NxiP71kmgTFf.jpg)
encounter Photograph: (encounter)
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల్లో మరికొందరు కీలక మావోయిస్టులున్నారని వార్తలు వస్తున్నాయి. ఒడిశాలోని నువాపాడా జిల్లాకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని కులారిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా జనవరి 19వ తేదీ రాత్రి ఆపరేషన్ ప్రారంభించింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఈ కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.
Also Read : USA: పడింది దెబ్బ..సిటిజెన్ షిప్‌కు టాటా గుడ్‌బై..ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్
గరియాబంద్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా)తో కూడిన బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఎన్కౌంటర్ అనంతరం పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్ లో భాగంగా కోబ్రాకు చెందిన ఒక జవాన్‌కు చిన్నపాటి బుల్లెట్ గాయం తగిలింది.
Also Read : ట్రంప్కు షాకిచ్చిన వివేక్ రామస్వామి .. కీలక నిర్ణయం!
అతన్ని చికిత్స కోసం అతన్ని విమానంలో రాయ్‌పూర్‌కు తరలించామని, అక్కడ అతని పరిస్థితి నిలకడగా ఉందని గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా విలేకరులకు తెలిపారు. గరియాబంద్ జిల్లాలో ఈ ఏడాదిలో ఇది రెండో ఎన్‌కౌంటర్. జనవరి 3న గరియాబంద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మరణించాడు. తాజా ఎన్కౌంటర్ తో ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది మావోయిస్టుల మరణాల సంఖ్య 28కి చేరగా, గతేడాది వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 219 మంది మావోయిస్టులు మరణించారు. అంతేకాకుండా, 2024లో రాష్ట్రంలో 992 మంది వామపక్ష తీవ్రవాదులను అరెస్టు చేయగా, 837 మంది లొంగిపోయారు.
Also Read : తగ్గేదేలే : ట్రంప్ మరో సంచలనం.. డబ్ల్యూహెచ్‌ఓకు గట్టి స్ట్రోక్