బార్బడోస్‌ వేదికగా వన్డే మ్యాచ్‌లో తలపడనున్న భారత్-విండీస్‌

టెస్ట్ సిరీస్‌ను నెగ్గిన ఉత్సాహంతో టీమ్ ‌ఇండియా వన్డే సిరీస్‌ కోసం రంగంలోకి దిగనుంది.భారత్‌ - వెస్టిండీస్‌ (IND Vs WI) జట్ల మధ్య మరో సిరీస్‌ స్టార్ట్ కానుంది.ఈ సమరంలో వెస్టిండీస్‌ని ఎదుర్కొనేందుకు భారత్ అన్నివిధాలుగా సన్నద్ధమైంది.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం (27-07-2023) బ్రిడ్జ్‌టౌన్‌లోని బార్బడోస్‌ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.టెస్టు సిరీస్‌ విజయంతో విండీస్‌ పర్యటనను ప్రారంభించిన టీమ్‌ఇండియాకు ఇప్పటివరకు పెద్దగా పోటీ ఎదురుకాలేదు.విండీస్‌ని కొట్టేందుకు భారత్ పోరు కొనసాగించనుంది.

New Update
బార్బడోస్‌ వేదికగా వన్డే మ్యాచ్‌లో తలపడనున్న భారత్-విండీస్‌

వన్డే సిరీస్‌లోనైనా విండీస్‌ (Windies) తమ పోరాటం చూపిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.అయితే విండీస్‌తో గత వన్డే సిరీస్‌ల్లో మాత్రం భారత్‌దే (Bharath) ఆధిపత్యం కావడం విశేషం.ఇరు జట్లూ ఇప్పటి వరకు 139 వన్డేల్లో తలపడ్డాయి.ఇందులో భారత్ 70 మ్యాచుల్లో విజయం సాధించగా విండీస్ 63 వన్డేల్లో గెలిచింది.నాలుగు రద్దు కాగా మరో రెండు మ్యాచ్‌లు టైగా ముగిశాయి.గతేడాది ఇదే సమయంలో (జులై 22-ఆగస్ట్ 7-2022) విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ ‌స్వీప్ (Clean Sweap)‌ చేసింది.వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ విండీస్‌పై భారత్‌ విజయం (Win) సాధించింది.ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 23 వన్డే సిరీస్‌లు జరిగాయి.ఇందులో భారత్‌దే ఆధిపత్యం కావడం విశేషం.

గతంలో ఇండియా 15 సిరీస్‌లకే పరిమితం

national-sports-head-to-head-odi-series-between-team-india-vs-west-indies

టీమ్‌ఇండియా 15 సిరీస్‌లను (15 Series) గెలుచుకోగా విండీస్ కేవలం 8కే పరిమితమైంది.అదీనూ 2000వ ఏడాది ముందు వరకు విండీస్‌ ఆరు సిరీస్‌లను గెలిచింది.ఆ తర్వాత కేవలం రెండింటినే సొంతం చేసుకుంది.భారత్‌ వరుసగా గత 12 సిరీస్‌లనూ గెలుచుకోవడం విశేషం.విండీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli).మొత్తం 42 మ్యాచుల్లోని 41 ఇన్నింగ్స్‌ల్లో 2,261 పరుగులు (Runs) చేశాడు.ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి.విండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గానూ విరాట్ కొనసాగుతున్నాడు.ఆ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 36 మ్యాచుల్లో 34 ఇన్నింగ్స్‌ల్లో 1,601 పరుగులు సాధించాడు.మరో ఎనిమిది వికెట్లు తీస్తే రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరిస్తాడు.ఇప్పటి వరకు 29 మ్యాచుల్లో 37 వికెట్లు పడగొట్టాడు.ఇరు జట్లలో మాత్రం కోట్నీ వాల్ష్ (Kotni Walls) (44) టాప్‌ వికెట్‌ టేకర్.ఆ తర్వాత కపిల్ దేవ్ (43),అనిల్‌ కుంబ్లే (41) ఉన్నారు.అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను బౌలర్‌ అనిల్ కుంబ్లే నమోదు చేశారు.

national-sports-head-to-head-odi-series-between-team-india-vs-west-indies

కోల్‌కతా (Kolkata) వేదికగా 1993లో జరిగిన మ్యాచ్‌లో కుంబ్లే (Kumbley) 12 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టాడు.అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్‌గా మాత్రం విండీస్‌ పేసర్ కీమర్ రోచ్ (Keemar Roach) చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.పది ఓవర్లలో ఏకంగా 88 పరుగులు ఇచ్చాడు.వెస్టిండీస్‌పై అత్యధిక భాగస్వామ్యం నిర్మించిన బ్యాటర్లుగా విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ కొనసాగుతున్నారు.వీరిద్దరూ ఇప్పటి వరకు 246 పరుగులను జోడించారు. అత్యధిక వికెట్లను పడగొట్టిన వికెట్‌ కీపర్‌గా ఎంఎస్ ధోనీ (MS Dhoni) (47) కొనసాగుతున్నాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్.ఇండోర్‌ (Indore) వేదికగా 2011లో 208 బంతుల్లో 219 పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్‌లో భారత్ 418/5 స్కోరు చేసింది.ఇదే ఇప్పటి వరకు విండీస్‌పై భారత్ చేసిన అత్యధిక స్కోరు (High Score).అయితే అత్యల్ప స్కోరు చేసిన జట్టుగానూ టీమ్‌ ఇండియానే ఉంది.1993లో అహ్మదాబాద్‌ (Ahmedabad) వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ కేవలం 100 పరుగులకే కుప్పకూలింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు