టమాట ధరల పెరుగుదలపై దుమ్ములేపుతున్న క్రేజీ రీల్స్..! ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన టాపిక్ టమాట ధరల ట్రెండింగ్ నడుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ధరల సంగతి పక్కన పెడితే.. ఈ టమాట పెరుగుదలపై మాత్రం రోజుకో క్రేజీ స్టోరీలు జరుగుతున్నాయి. ఒకరేమో టమాటలు కాపాడుకోవడానికి బౌన్సర్లు పెట్టుకుంటే.. మరొకరు కూరలో రెండు టమాటాలు వేశాడని భర్తను వదిలేసింది ఓ భార్య. ఇక ఓ రైతు ఒక్కరోజులో టమాటలు అమ్మి రూ.36 లక్షలు సంపాదించాడు. ఇలా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు టమాటపై కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. By Shareef Pasha 14 Jul 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి దేశంలో టమాట ధర పెరుగుదల సామాన్యులపై చాలా ప్రభావం చూపుతోంది. దొంగతనాలు చేసినప్పుడు దొంగలు బంగారం, డబ్బుతో పాటు నాలుగు టమాటలు కూడా తీసుకెళ్తే మనకు ఖర్చు తగ్గుతుంది కదా అని దొంగలు కూడా ఆలోచిస్తున్నారంటే.. టమాటలకు ప్రస్తుతం ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటిదాకా పది, ఇరవై రుపాయలకు కిలో ఉన్న టమాట ఇప్పుడు రూ.120 నుంచి రూ.250 పలుకుతోంది. ఈ ధరలు చూసి సామాన్య ప్రజలు హడలెత్తి పోతున్నారు. అయితే సమాజంలో ఏది జరిగినా.. దాన్ని ఫన్‌గా తీసుకుని మీమ్స్, రీల్స్, షాట్స్ చేయడం సోషల్ మీడియా యూజర్స్‌కు బాగా అలవాటైపోయింది. ఇక ఈ టమాట ధరల పెరుగుదలతో జరుగుతున్న వివిధ రకాల సంఘటనలను చూసి వీళ్లు ఊరుకుంటారా..? అందుకే టమాట ధరల పెరుగుదలపై రకరకాల రీల్స్, షాట్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో సేల్ నడుస్తుంది డబ్బులు ఇవ్వమని అన్నను అడిగిన చెల్లెలు View this post on Instagram A post shared by AKHIL KUMAR (@akhil.jackson) ఒక వీడియోలో చెల్లి ఆన్‌లైన్‌లో సేల్ నడుస్తుంది డబ్బులు ఇవ్వమని తన అన్నను అడుగుతుంది. దానికి వాళ్ల అన్నయ్య కళ్లు మూసుకో అని చెప్పి తన చేతిలో నాలుగు టమాటలు పెడతాడు. ఏంటి అన్న ఇది అంటే.. ఆ అన్న ఓ థియరీ చెబుతాడు. ఆ థియరీకి కన్విన్స్ అయిన ఆ అమ్మాయి తన సోదరుడు చెప్పింది ఒప్పుకుని తను ఇచ్చిన టమాటలకో షాపింగ్ చెయ్యడానికి సిద్ధమవుతుంది. నన్ను ఏది అడిగినా టమాటనే ఇస్తా..? View this post on Instagram A post shared by Prashanth Práshú (@prashu__baby) ఇక మనం ఈ మధ్య కాలంలో ఏది కొన్నా ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నాం. ఆఖరికి పది రుపాయల చాయ్ కొన్నా ఐదు రుపాయల చాక్లెట్ కొన్నా ఏ ఫోన్ పే నో, గూగుల్ పే నో ఉపయోగిస్తున్నాం. కానీ ఇప్పుడు కొంత మంది ఏం చేస్తున్నారంటే పెరిగిన టమాట ధర దృష్ట్యా ఏదీ కొన్నా టమాటాలను బదులుగా ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టమాటల విలువ చాలా ఎక్కువ కాబట్టి... దీనికి సంబంధించిన ఒక వీడియో యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతుంది. టమాటాను ఇలా కూడా దాచి పెడతారా..? View this post on Instagram A post shared by Priya Arora ✨ (@thepriyafamily) టమాట ధర పెరగడేమో కానీ వాటి దొంగతనాలు కూడా ఎక్కువయ్యాయి. వ్యాపారులు టమాటాలు కాపాడుకోవడానికి సీసీ కెమెరాలు కూడా పెడుతున్నారు. ఒక వ్యాపారి అయితే ఏకంగా టమాటాల కాపలాకు బౌన్సర్లను పెట్టేశాడు. కానీ ఓ మహిళ మాత్రం ఇంకాస్త వెరైటీగా ఆలోచించి టమాటాలను దాచి పెట్టింది.ఈమె టమాటాలను దాచిపెట్టిన తీరు చూస్తే బంగారు ఆభరణాల కంటే కూడా ఇప్పుడు మగువలు టమాటాలే అత్యంత విలువైనవిగా భావిస్తున్నారన్నమాట. ఇంతకీ ఈ మహిళ టమాటాలను ఏ రకంగా భద్రపరిచిందో తెలుసుకోవాలంటే ఓసారి ఈ వీడియో చూసేయండి. చూశారు కదా.. టమాట ధరల పెరుగుదలతో ఓవైపు సామాన్యులు హడలెత్తిపోతుంటే.. మరోవైపు సోషల్ మీడియా యూజర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం ఇలా ఫన్నీగా స్టోరీస్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ టమాటాల ధర మంట ఎప్పుడు తగ్గుతుందోనని సామాన్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి