Jobs: డిగ్రీ అర్హతతో... ఈ ప్రభుత్వ సంస్థలో భారీ రిక్రూట్‎మెంట్..వెంటనే అప్లయ్ చేసుకోండి..!!

మీరు సర్కార్ నౌకరీ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 74 ఖాళీలను రిక్రూట్ చేస్తుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 1. పూర్తివివరాలు ఈ స్టోరీలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.

New Update
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..అటవీశాఖలో 689 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!!

నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, NFL మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 1. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nationalfertilizers.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 4 వరకు సవరించుకునే అవకాశం కల్పించింది.

ఖాళీ వివరాలు:
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) పోస్టులకు 74 ఖాళీలు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఎ) పోస్టులకు 10 ఖాళీలు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా) పోస్టుల కోసం 4 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది.

వయో పరిమితి:
అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి.

అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60శాతం మార్కులతో ఎంబీఏ, పీజీడిబిఎం, పీజీడిఎం మార్కెటింగ్ లేదా అగ్రి బిజినెస్ మార్కెటింగ్ లేదా రూరల్ మేనేజ్ మెంట్, ఫారిన్ ట్రేడ్ లేదా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ, పీడబ్య్లూబీడీ బీఎస్సీ అగ్రికల్చర్ లో 50శాతం మార్కులు కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము:
మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా), మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్&ఎ) కోసం దరఖాస్తు రుసుము రూ. 700.

ఇలా దరఖాస్తు చేసుకోండి:
-ముందుగా www.nationalfertilizers.com అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి

- ఆపై హోమ్‌పేజీలో కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

-దీని తర్వాత దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి

- ఇప్పుడు దరఖాస్తు ఫారమ్ నింపండి

-దీని తర్వాత దరఖాస్తు ఫీజును చెల్లించండి.

- చివరగా భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 17,710 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు