Kaleswaram Project: కాళేశ్వరం పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక

ప్లానింగ్, డిజైన్ ,క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చింది. ఇప్పుడు బ్యారేజ్ని ఉపయోగించడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది.

New Update
Kaleswaram Project: కాళేశ్వరం పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడానికి కారణాలు ఏంటో తేల్చి చెప్పేసింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ (Dam Safety Authority). మేడిగడ్డ తర్వాత అన్నారం బ్యారేజికి కూడా సమస్యలు రావడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ప్లానింగ్, డిజైన్ ,క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) కుంగిందని సేఫ్టీ అథారటీ అధికారులు చెబుతున్నారు. బ్యారేజిని కొన్ని రోజులు ఉపయోగించడానికి లేదని తేల్చారు. బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ,ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని చెబుతున్నారు. అన్నారం, సుందిళ్లలో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు చెబుతున్నారు.

Also Read: ప్లీజ్ నన్ను మైలార్డ్ అని పిలవకండి

మరోవైపు కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీకి అరకొర సమాచారం మాత్రమే ఇచ్చింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇన్స్ట్రుమెంటేషన్ , వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్ల పై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఒక వేళ కావాలని సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.

పిల్లర్లు కుంగడానికి ప్రధాన కారణాలు:
బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది
ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదు
బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయింది
బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదు
బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం
బ్యారేజీ బ్లాక్ లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్ని ఉపయోగించడానికి అవకాశం లేదు
ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుంది
మేడిగడ్డ తరహాలోనే అన్నారం సుందిళ్ల నిర్మించారు
ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది
వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సుందిళ్లను తనిఖీ చేయాలి

Advertisment
Advertisment
తాజా కథనాలు