రామ్ చరణ్ Vs అల్లు అర్జున్.. ఫ్యాన్స్ వార్ లో నలిగిపోతున్న మెగాహీరోలు

ఓ వైపు జాతీయ అవార్డ్ వచ్చిందనే ఆనందం. మరోవైపు శుభాకాంక్షలు సరిగ్గా చెప్పలేదనే ఆక్రోషం. వెరసి మెగా కాంపౌండ్ ఇప్పుడు భగ్గుమంటోంది. ఫ్యాన్స్ లో సెలబ్రేషన్ చేసుకునేవాళ్లు చేసుకుంటున్నారు, మరోవైపు రగిలిపోయే బ్యాచ్ కూడా అదే స్థాయిలో ఉంది. ఇంతకూ ఏం జరిగింది?

New Update
రామ్ చరణ్ Vs అల్లు అర్జున్.. ఫ్యాన్స్  వార్ లో నలిగిపోతున్న మెగాహీరోలు

అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ వచ్చింది. పుష్ప సినిమాలో నటనకు గాను అతడ్ని ఉత్తమ నటుడిగా ప్రకటించింది జ్యూరీ. టాలీవుడ్ నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న తొలి హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు. దీంతో మెగా కాంపౌండ్ లో సంబరాలు అంబరాన్ని తాకాయి. అంతవరకు బాగానే ఉంది. అసలు వివాదం ఆ తర్వాతే మొదలైంది

బన్నీకి అవార్డ్ వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యాడు. ట్విట్టర్ లో పెద్ద నోట్ పెట్టాడు. ఆర్ఆర్ఆర్ కు 6 అవార్డులు వచ్చాయి కాబట్టి, అక్కడ్నుంచి స్టార్ట్ చేశాడు.

publive-image అల్లు అర్జున్ కి స్వీట్ తినిపిస్తున్న చిరంజీవి

అందులోనే ఓ చోట బన్నీకి శుభాకాంక్షలు చెప్పాడు. అంతేతప్ప, అతడ్ని ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. దీనికి అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యాడు. థ్యాంక్స్ అంటూ ప్రతిస్పందించాడు.

సరిగ్గా ఇక్కడే ఇటు బన్నీ ఫ్యాన్స్, అటు చిరు ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. చరిత్రలోనే తొలిసారి టాలీవుడ్ నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డుకు ఎంపికైన బన్నీకి శుభాకాంక్షలు చెప్పే విధానం ఇదేనా అని ప్రశ్నిస్తోంది అల్లు అర్జున్ ఆర్మీ. బన్నీపై ప్రత్యేకంగా ట్వీట్ వేయనందుకు చరణ్ ను ట్రోల్ చేస్తున్నారు.


దీనిపై చరణ్ అభిమానులు కూడా భగ్గుమంటున్నారు. మహేష్ తో పాటు చాలామంది హీరోలు పెట్టిన ట్వీట్స్ పై సవివరంగా స్పందిస్తూ, ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్, అదే స్టయిల్ లో రామ్ చరణ్ ట్వీట్ కు కూడా రెస్పాండ్ అవ్వొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువు వేరే ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లినప్పుడు బన్నీ ట్వీట్ పెట్టాడు. అందులో చరణ్ ను ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అందరితో కలిపి ట్రీట్ చేశాడు. అప్పుడు బన్నీ వ్యవహారశైలిపై చాలా విమర్శలు చెలరేగాయి. బహుశా, అందుకే ఇప్పుడు చరణ్ కూడా ముక్తసరిగా ట్వీట్ పెట్టి ఉంటాడనే టాక్ నడుస్తోంది.

publive-image బన్నిని అభినందిస్తున్న చిరు

Advertisment
Advertisment
తాజా కథనాలు