Space Station: అంతరిక్ష కేంద్రంలో టమాటా మాయం.. 8 నెలల తరువాత ప్రత్యక్షం..!

అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. ఎనిమిది నెలల క్రితం పోయిన టమాటా మళ్లీ దొరికొంది. స్పేస్ సెంటర్‌లో పండించిన ఈ టమాటా గత మార్చి నెలలో మిస్ అవగా.. తాజాగా దొరికినట్లు ప్రకటించారు.

New Update
Space Station: అంతరిక్ష కేంద్రంలో టమాటా మాయం.. 8 నెలల తరువాత ప్రత్యక్షం..!

NASA Space Station: హమ్మయ్య ఎట్టకేలకు దొరికేసింది.. 8 నెలల గాలింపునకు ముగింపు పలికింది.. స్పేస్ సెంటర్‌లో వ్యోమగాముల శ్రమకు ఫలితం దక్కింది.. ఎంతో విలువైనది ఒక్కసారిగా మిస్ అవడంతో అంతా షాక్‌కు గురయ్యారు. చివరకు 8 నెలల తరువాత మళ్లీ దొరకడం హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ఇంతకీ ఏం పోయింది.. ఏం దొరికిందినేగా మీ కంగారు.. టెన్షన్ పడకండి. టమాటా పోయింది.. మళ్లీ 8 నెలల తరువాత దొరికింది. అవును.. టమాటానే.. అయితే, ఇక్కడ పోలేదు. అంతరిక్షంలో పొయింది. అందుకే అంత స్పెషల్‌గా నిలిచింది ఆ టమాటా. గత మార్చి నెలలో భూమికి వెలుపల అంతరిక్షంలో పంట పడించారు నాసా ఆస్ట్రోనాట్స్. ఆ పంటలో భాగంగా టమాటాను పండించారు. అయితే, స్పేస్ సెంటర్‌లో ఉన్న వ్యోమగామి ఫ్రాంక్ రూబియో తన వాటాగా పొందిన ఈ టమాటాను పోగొట్టాడు. దాంతో మిగతా సహచరులలో ఎవరో ఒకరు తన టమాటాను తిని ఉంటారని భావించాడు. కానీ, చివరకు అది దొరకడంతో అంతా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు.

స్పేస్ సెంటర్‌లో 1 అంగుళం(2.5 సెంటీమీటర్ల) రెడ్ రాబిన్ డ్వార్ఫ్ టమాటా వెజ్-05 ప్రయోగం చివరి పంటలో భాగంగా కాసింది. అయితే మార్చి 29 ఈ టమాటాను ఆస్ట్రోనాట్ రూబియోకు అప్పగించారు. ఈ టమాటా తన జిప్‌ లాక్ బ్యాగ్‌లో పెట్టాడు. కానీ, అది ఎలాగో మిస్ అయ్యింది. ఏదో ఒక రోజు అది దొరుకుతుందని భావించాడు రూబియో. అతను అనుకున్నట్లుగానే టమాటా అవశేషం అతనికి కనిపించింది. అయితే, అది ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది అనే విషయాన్ని ఆస్ట్రోనాట్ రూబియో గానీ, నాసా గానీ వెల్లడించలేదు.

Also Read:

చిన్న రాష్ట్రం.. మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకుంది..

అగ్గిపుల్ల ఇవ్వలేదని వాచ్‌మెన్‌పై యువకుడి దాడి.. తల పగిలేల కొట్టి

Advertisment
Advertisment
తాజా కథనాలు