NASA Jobs : నాసాలో ఉద్యోగం కావాలా? చదువు అవసరం లేదు..ఈ ఒక్క పని వస్తే చాలు..!! అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా చదువుతో సంబంధం లేకుండా మార్స్ పై ఏడాది పాటు ఉద్యోగం చేసేందుకు దరఖాస్తు కోరుతుంది. అంగారక గ్రహంపైకి వెళ్తే అక్కడేం చేస్తామో దాన్ని భూమిపైన్నే చేస్తున్నట్లు నటించాలి. ఇలాంటి నలుగురి కోసం నాసా వెతుకుతోంది. జీతం కూడా భారీగానే చెల్లిస్తుందట. By Bhoomi 22 Feb 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి NASA Jobs : అనేక దశాబ్దాలుగా అంతరిక్ష శాస్త్రంలో ప్రపంచం గొప్ప పురోగతి సాధించింది. వేల సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించి, చంద్రునిపై మానవులను దింపారు. అంతేకాదు ఇప్పుడు అంగారకుడిపై జీవరాశిని అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకేసిన భారత్(India) సూర్యుని గురించి పరిశోధనలు చేయడం ప్రారంభించిది. ఇందులో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో(India), అమెరికా ఏజెన్సీ నాసా(America Agency NASA) ఎన్నో విజయాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇప్పుడు అంగారకుడిపైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నాసా..అందరూ ఆశ్చర్యపోయే ఓ విశిష్టమైన పనిని తెరపైకి తెచ్చింది.నాసాలో పనిచేసేందుకు నలుగురు ఉద్యోగుల కోసం వెతుకుతుంది. ఈ ఉద్యోగం ఎవరికి దక్కుతుందో వారికి భారీ జీతాన్ని కూడా చెల్లిస్తుందట. పలు నివేదికల ప్రకారం.. నాసా అంగారక గ్రహం(Mars)పై ఇళ్లను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. అంగారకుడిపై వెళ్లి ఇళ్లు కడితే.. అక్కడి వాతావరణానికి ప్రజలు ఎలా అలవాటు పడతారు..వారి ఆహారం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎలా ఉంటుందో తెలుసుకోవానుకుంటుంది. అయితే దీన్ని తెలుసుకునేందుకు అంగారకుడి మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు. భూమిపైనే అంగారకుడి మాదిరి సెట్ తయారు చేసి అక్కడ ఇల్లును నిర్మిస్తున్నారు. ఈ ఇంట్లో అంగారక గ్రహం మీద ఎలాంటి వాతావరణం ఉంటుందో అచ్చం అలాగే ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇంటికి 'సిమ్యులేటెడ్ మార్స్ హాబిటాట్' అని పేరు పెట్టారు. అయితే టెస్ట్ చేసేందుకు ఆ ఇంట్లో కొంతమందిని ఉంచాలని నాసా ప్లాన్ చేస్తోంది. ఇందులో సెలక్ట్ అయినవారికి భారీగానే జీతాన్ని కూడా ప్రకటించింది. 1700 చదరపు అడుగులున్న సిమ్యులేషన్ హౌస్‌లో 4 మంది నివసించవచ్చని నాసా తెలిపింది. ఈ ఇంట్లో ఉండడంతో పాటు..స్పేస్ వాక్‌కి వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇది కాకుండా, ఇండోర్ మార్టిన్ వాతావరణంలో పంటలను పండించాల్సి ఉంటుంది. రోబోటిక్స్(Robotics) తో పని చేయాల్సి ఉంటుంది. ఈ మిషన్‌కు క్రూ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ప్లోరేషన్ అనలాగ్ అని పేరు పెట్టారు. ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు? ఈ మిషన్ వచ్చే ఏడాది అంటే 2025లో ప్రారంభమవుతుందని నాసా(NASA) తెలిపింది. ఇందుకోసం ఏప్రిల్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 30 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి తప్పనిసరిగా అమెరికన్ పౌరుడు లేదా అమెరికాలో శాశ్వత నివాసి అయి ఉండాలి. అతనికి ఇంగ్లీషు తెలిసి ఉండాలి. ఆల్కహాల్, ధూమపానం చేయకూడదు. ఇది కూడా చదవండి : సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ #nasa #mars #space-news #nasa-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి