Narendra Modi: సీఏఏ రద్దు సాధ్యం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ 

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు యూపీలోని అజంగఢ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పౌరసత్వ సవరణ చట్టం (CAA) చుట్టూ విపక్షాలు చేస్తున్న దాడిని తిప్పికొట్టారు. ఇండియా కూటమిపై విమర్శల దాడి చేశారు. 

New Update
Elections 2024 : ఎక్కడ ప్రచారం చేశారో అక్కడ ఓటమి.. మహారాష్ట్రలో పని చేయని మోదీ చరిష్మా

Narendra Modi: ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), కాశ్మీర్, హిందూ-ముస్లిం సమస్యలపై ఆయన విపక్షాలపై విరుచుకు పడ్డారు. ప్రజల ఆశీస్సులు తమ  వెంట ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే నినాదం... మరోసారి మోడీ ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని చెప్పారు. ప్రపంచానికి ఈ నమ్మకం ఎలా వచ్చింది? ఇది రాత్రికి రాత్రి వచ్చిన నమ్మకం కాదు అని ప్రధాని చెప్పారు. 

Narendra Modi: మోదీ హామీ అంటే ఎలా ఉంటుంది అనడానికి తాజా ఉదాహరణ సీఏఏ చట్టమని ప్రధాని అన్నారు. పౌరసత్వం ఇచ్చే  పని నిన్నటి నుంచే మొదలైంది. మొదటి లాట్‌కు పౌరసత్వం ఇచ్చే పని ప్రారంభమైంది. మనతో పాటు శరణార్థులుగా బతుకుతున్న వారు.. వేలాది కుటుంబాలు చిత్రహింసలను ఎదుర్కొని, తమ కుమార్తెల గౌరవాన్ని కాపాడేందుకు భారతమాత గర్భంలో ఆశ్రయం పొందాయి.  కానీ కాంగ్రెస్ వారి ఓటు బ్యాంకు కానందున వారిని పట్టించుకోలేదు. అందుకే అక్కడా ఇక్కడా చిత్రహింసలు పెట్టారు. అంటూ ప్రధాని విమర్శల వర్షం కురిపించారు. 

సీఏఏ రద్దు సాధ్యం కాదు: ప్రధాని మోదీ
Narendra Modi: ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. విపక్షాలను బట్టబయలు చేసింది మోదీ. మీరు 60 ఏళ్లుగా మత మంటల్లోకి దేశాన్ని తోసేశారు. నేను స్పష్టంగా చెబుతున్నాను.  ఇది మోదీ  గ్యారెంటీ. దేశంలో లేదా విదేశాలలో ఎక్కడి నుండైనా మీకు ఏ శక్తి తోడుగా వచ్చినా మీరు CAAని రద్దు చేయలేరు అని చెప్పారు. 

Also Read: ఇండియా కూటమికి మద్ధతిస్తాం.. దీదీ సంచలన ప్రకటన

Narendra Modi: మోదీ సీఏఏ తీసుకొచ్చారని ఇండియా కూటమి ప్రజలు అంటున్నారని, మోదీ వెళ్లే రోజు ఈ సీఏఏ కూడా పోతుందని అంటూ ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి, హిందువులు, ముస్లింల మధ్య పోట్లాడుతూ సెక్యులరిజం అనే వేషం ధరించి మీ నిజాలు బయటకు రావడం లేదని, మోదీ మాత్రం మీ నిజాలను బయటపెట్టారని దేశ ప్రజలకు తెలిసిపోయిందని ప్రధాని విపక్షాలనుద్దేశించి ఘాటుగా విమర్సించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు