Nyayaniki Sankellu: నేడు "న్యాయానికి సంకెళ్లు" పేరుతో టీడీపీ నిరసన.. మరో సారి ఢిల్లీకి లోకేష్.. వివరాలివే! చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈరోజు రాత్రి 7.గం.లకు "న్యాయానికి సంకెళ్లు" నల్ల రిబ్బన్ లను చేతులకు కట్టుకుని నిరసన తెలియజేయాలని ఏపీ ప్రజలకు నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ చేయాలని కోరారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు కేసుల వ్యావహారం చర్చించడానికి ఈ రోజు మరో సారి ఢిల్లీ వెళ్లనున్నారు లోకేష్. By Nikhil 15 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డవలప్మెంట్ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయిన నాటి నుంచి ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి దాదాపుగా రాజమండ్రిలోనే ఉంటున్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ (Nara Lokesh) ఢిల్లీలో ఉంటూ న్యాయవాదులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే.. నిన్న రాజమండ్రికి వచ్చిన నారా లోకేష్ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ రోజు రాజమండ్రి నుంచి నారా లోకేష్, బ్రాహ్మణి హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఈ రోజు సాయంత్రం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చంద్రబాబు అరెస్ట్ జరిగిన నాటి నుంచి వివిధ నిరసన కార్యక్రమాలను చేపడుతోంది టీడీపీ. ఇది కూడా చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ తీరు అమానవీయం..పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన తాజాగా నారా లోకేష్ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈరోజు రాత్రి 7.గం.లకు "న్యాయానికి సంకెళ్లు" నల్ల రిబ్బన్ లను చేతులకు కట్టుకుని నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ''చట్టాల్ని చుట్టం చేసుకొని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, న్యాయానికి సంకెళ్లు వేసిన సైకో జగన్ అరాచకాలపై నిరసనగా.. చట్టాల్ని చుట్టం చేసుకొని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, న్యాయానికి సంకెళ్లు వేసిన సైకో జగన్ అరాచకాలపై నిరసనగా ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలు మధ్యలో నిరసన తెలియజేయండి. చేతులకు తాడు, రిబ్బన్, ఏదైనా గుడ్డతో సంకెళ్లులా కట్టుకొని నిరసన తెలియజేయండి. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్… pic.twitter.com/BtoqaYCvSZ — Lokesh Nara (@naralokesh) October 15, 2023 ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలు మధ్యలో నిరసన తెలియజేయండి. చేతులకు తాడు, రిబ్బన్, ఏదైనా గుడ్డతో సంకెళ్లులా కట్టుకొని నిరసన తెలియజేయండి. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ చేయండి. అక్రమ నిర్బంధంలో ఉన్న చంద్రబాబు గారికి మద్దతుగా నిలవండి.'' అని ట్విట్టర్ లో కోరారు నారా లోకేష్ #nara-lokesh #ap-skill-development-case #acb-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి