Nara Lokesh : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్.. మెగా డీఎస్సీపై తొలి సంతకం ..! ఏపీ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. చాంబర్ లో స్వల్ప మార్పుల అనంతరం ఐటీ, RTG, మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ పదవి బాధ్యతలు తీసుకున్నారు.సెక్రటేరియట్ నాలుగో బ్లాక్‌లో ఆయనకు చాంబర్ కేటాయించారు. By Jyoshna Sappogula 24 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Minister Nara Lokesh : రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ - 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలిసంతకం చేశారు. Also Read: పవన్ కళ్యాణ్‌తో భేటీ.. స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరిన ప్రముఖ నిర్మాతలు..! మెగా డీఎస్సీ ద్వారా 16347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసంతకం చేసిన దస్త్రం పైనే సంబంధిత శాఖ మంత్రిగా.. లోకేష్ విధివిధానాలు రూపొందించి సంతకం చేసి కేబినెట్ కు పంపారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా పలువురు ఏపీ మంత్రులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు. Also Read : ఇక నుంచి రాత్రి 10.30 కల్లా షాపులు మూసివేయాల్సిందే! #nara-lokesh #ap-secretariat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి