Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణ కొనసాగుతోంది. నిన్న జరిగిన విచారణలో లోకేష్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఈ రోజు ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది.

New Update
Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ (Nara Lokesh) సీఐడీ విచారణ రెండో రోజు విచారణ కొనసాగుతోంది. తాజాగా ఆయనకు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ రోజు విచారణలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలపై సీఐడీ ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ఆయన చెప్పిన సమాధానాల ఆధారంగా ప్రశ్నలను అడుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) అలైన్ మెంట్ మార్పుకి ఒత్తిడి చేశారా?, మీరు మంత్రి అవ్వగానే మిమ్మల్ని మంత్రివర్గ ఉపసంఘంలో ఎందుకు చేర్చారు? హెరిటేజ్, లింగమనేని, నారాయణ (AP Ex Minister Narayana) భూములకు లబ్ధి చేసేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు? ఇన్నర్ రింగ్ రోడ్డు భూ సేకరణ పరిహారాన్ని భారీగా పెంచడంలో మీ పాత్ర ఉందా?, భూ సేకరణ వ్యయాన్ని 210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారు? తదితర ప్రశ్నలను లోకేష్ ను అడిగి సమాధానాలను రాబట్టేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Chandrababu: జైలులో చంద్రబాబుకు అస్వస్థత..

ఇన్నర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టు వ్యయాన్ని అదనంగా పెంచేందుకు సిఫార్సు చేశారా..? లేదా..? లింగమనేని రమేష్ (Lingamaneni Ramesh) ఎందుకు మీకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు? లింగమనేని భూములకు మేలు చేసినందుకే మీకు ఇంటిని క్విడ్ ప్రో కోలో భాగంగా ఇచ్చారా? తదితర ప్రశ్నలకు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. తాను ఎక్కడా.. ఎలాంటి అవినీతి చేయలేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించామని నారా లోకేష్ సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.

కొన్ని ప్రశ్నలకు తెలియదరు అని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఏపీ మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కూడా ఈ రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే.. వీరిద్దరిని కలిసి విచారించారా? లేదా వేర్వురుగా విచారించారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు