Nara Lokesh : 'అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ములు చెల్లించాలి'..జగన్ కు లోకేష్ డిమాండ్.! తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులు యువగళం పాదయాత్రలో తనను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 30 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Nara Lokesh Letter to CM Jagan: ఏపీ సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులకు (Agri Gold Victims) సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 'జగన్ గారు! మీరు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు, అగ్రిగోల్డ్ విషయంలో మా టిడిపి ప్రభుత్వంపైనా, నాపైనా చేసిన ఆరోపణలు, చిమ్మిన విషం మీరు మరిచిపోయుంటారు. కానీ మేము మరిచిపోలేదు' అని అన్నారు. నాటి సీఎం వైఎస్ (YSR) పాలనలో పుట్టిన అగ్రిగోల్డ్, ఆయన హయాంలోనే స్కాం చేసిందని ఆరోపించారు. 2014లో టిడిపి (TDP) అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులు 21 వేల ఎకరాలు అటాచ్ చేసి, యాజమాన్యాన్ని అరెస్టు చేయించి, బాధితులకు న్యాయం చేసిందన్నారు. అయినా మాపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్షనేతగా హామీలిచ్చి గద్దెనెక్కాక మీరు చేసిన మోసంతో రోడ్డునపడిన అగ్రిగోల్డ్ బాధితులు యువగళం పాదయాత్రలో (Yuvagalam) తనను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామన్న సొమ్ములేవీ? అని ప్రశ్నించారు. Also Read: ‘పవన్ పెళ్లిళ్ల గురించి కాదు జగన్ .. ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకో’.. కిరణ్ రాయల్ కౌంటర్.! మా టిడిపి ప్రభుత్వం డిపాజిటర్లకి ఇవ్వడానికి సిద్ధం చేసిన రూ.250 కోట్లు పంపిణీ చేయకుండా అడ్డుకుని, తీరా అదే సొమ్ములో 14 కోట్లు తగ్గించి, 22 వారాల తరువాత 236 కోట్లే పంపిణీ చేసి చేతులు దులుపుకున్న మీ తీరుతో బాధితులు మరింత బాధపడ్డారని వాపోయారు. మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం అని ప్రచారం చేసుకున్న మీ పాలనలో చనిపోయిన 600 మంది అగ్రిగోల్డ్ (Agri Gold) బాధితుల్లో ఏ ఒక్కరి కుటుంబానికైనా ఇస్తామన్న రూ.10 లక్షల పరిహారం ఇచ్చారా? కనీసం పరామర్శ చేశారా? ఇదేనా మీ మానవత్వం? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 2014-19 మధ్యలో బలవన్మరణాలకు పాల్పడిన 142 మంది అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు 5 లక్షల వరకూ ఎక్స్ గ్రేషియా నాటి మా టిడిపి ప్రభుత్వం అందించిందని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసిన టిడిపి ప్రభుత్వంపై మీరు చేయని ఆరోపణ లేదని.. నేను అగ్రిగోల్డ్ భూములు కొట్టేశానని బరితెగించి రాయించారని లోకేష్ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సీఎం అయి ఐదేళ్లయినా అగ్రిగోల్డ్ కి చెందిన ఒక్క సెంటు ఆస్తి అయినా అటాచ్ చేయలేదు ఎందుకు? అని అడిగారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై మీరు, మీ అనుచర గణం కన్నేసి దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఇప్పటికీ ఇంకా మిగిలిన 10 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లకి మీరు దిగేలోగానైనా వారికి రావాల్సిన రూ.3080కోట్లను చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. #andhra-pradesh #nara-lokesh #cm-jagan #ap-cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి