AP Politics: ప్రజల డబ్బుతో జగన్ రాజకీయం: యనమల ధ్వజం

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టును నిరసిస్తూ చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు దీక్షలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నారా భువనేశ్వరి, రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు, ఢిల్లీలో నారా లోకేష్ ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. లోకేష్ క్యాంపు కార్యాలయానికి భువనేశ్వరిని పలువురు టీడీపీ నేతలు కాలిశారు.

New Update
AP Politics: ప్రజల డబ్బుతో జగన్ రాజకీయం: యనమల ధ్వజం

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోకేష్ క్యాంపు కార్యాలయానికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేరుకున్నారు. శుక్రవారం చంద్రబాబుతో ములాఖాత్ అయ్యి హైదరాబాద్ వెళ్ళి, ఈరోజు తిరిగి వచ్చిన బ్రాహ్మణి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపు రాజమండ్రిలో భువనేశ్వరి దీక్ష చేయనున్నారు. రేపు గాంధీ జయంతి రోజున ఒకరోజు నిరసన దీక్ష చేపట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి-భువనేశ్వరిని పలువురు టీడీపీ నేతలు కలిశారు. కాగా.. ఈ నిరసన దీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోనూ వ్యతిరేకంగా ఉన్నారు

ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ఒక విజన్ ఉన్న నాయకుణ్ణి ఆధారాలు లేకుండా లోపల పెట్టడంపై రాష్ట్రంలోనూ.. దేశంలోనూ చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జీరో స్థాయికి వెళ్తారని భయంతో డైవర్ట్ చేయడనికి ఇలా అక్రమ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని భయపెట్టి...పని చేయిస్తున్నారని ఆరోపించారు. 10 నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారంటే ఎనికల్లో ఉపయోగించు కోవడానికే... ప్రజాధనంతో ఎన్నికలు చెయడానికి జగన్ నిర్ణయించుకున్నాడు.. అందుకే ప్రజల డబ్బుతో రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబు జైల్‌లో, లోకేష్ ఢిల్లీలో, భువనేశ్వరి క్యాంపులో దీక్ష చేస్తారని ఆయన తెలిపారు.

ఒక్కరోజు దీక్ష..

రాష్ట్రంలో సెక్షన్ 30 ,144 ఆంక్షలతో నిరసనలు చేయకుండా అడ్డుకుంటూన్నారు. నిరసనలు ఆపే హక్కు వారికి లేదపి గోరంట్ల బుచ్చయ్య తెలిపారు. ఉదయం 10 నుంచి 5 గంటల వరకు భువనేశ్వరి దీక్షలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. రేపు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేస్తామన్నారు. రేపు 175 నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజలు గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబుకు మద్దతుగా దీక్షలు చేయనున్నారని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజలంతా కులాలకు అతీతంగా చంద్రబాబు వెంట నడవనున్నారన్నారు. కావాలని జగన్మోహన్ రెడ్డి కులం ఆపాదిస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. అతి త్వరలో జగన్ బాధపడే రోజు దగ్గరలోనే ఉంది...జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు.

అధైర్య పడాల్సిన అవసరం లేదు

మరో వైపు కృష్ణా జిల్లా గన్నవరంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 19వ రోజుకు నిరసన దీక్షలు చేరుకుంది. నిరసన దీక్ష శిబిరంకు వచ్చి మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణ సంఘీభావం ప్రకటించారు.  యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. అక్రమ కేసులతో కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే న్యాయ సహాయం చేయటానికి ఎప్పుడూ ముందుంటామన్నారు. చంద్రబాబు నిజంగా అవినీతికి పాల్పడే వ్యక్తి అయితే.. హైటెక్ సిటీ నిర్మాణం జరిగినప్పుడు గానీ.. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగినప్పుడు గానీ కొన్ని ఉండేవాడు కాదా అని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు