Chandrababu Arrest Updates: ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన భువనేశ్వరి.. చంద్రబాబును తల్చుకుని నారా భువనేశ్వరి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రగిరిలో పర్యటిస్తున్న ఆమె.. తన భర్త లేకుండా రెండు రోజులు స్వగ్రామంలో ఉండటం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. తన భర్తతో ఉన్న జ్ఞాపకాలు తన మనసును పిండేశాయన్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని, ఈ రోజు కాకపోయినా రేపు అయినా నిజం గెలవడం ఖాయం అన్నారు. By Shiva.K 25 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Nara Bhuvaneshwari: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. స్వగ్రామంలో ఒంటరిగా రెండు రోజులు గడిపిన తనకు తన భర్త చంద్రబాబు జ్ఞాపకాలు పిండేశాయని అన్నారు భువనేశ్వరి(Nara Bhuvaneshwari). బుధవారం చంద్రగిరిలో పర్యటించిన ఆమె.. పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ అవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా స్వగ్రామంలో రెండు రోజులు గడిపిన తనకు తన భర్త జ్ఞాపకాలు మనసుకు బాధ కలిగించాయన్నారు. తన మనసులో ఏముందో కార్యకర్తలకు తెలుసునని అన్నారు. తాను రాజకీయాలు చేయడం కోసం ఇక్కడికి రాలేదని, ఈ పోరాటం ప్రజల కోసమేనని అన్నారు. భువనేశ్వరి ఇంకా ఏమన్నారో ఆమె మాటల్లోనే.. 'ఎన్టీఆర్ స్పూర్తితో ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేశాము. 3 వేల మంది అనాధ పిల్లలకు చదువు చెప్పిస్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందజేశాము. చంద్రబాబు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. చంద్రబాబు పొరపాట్లను నేను ఎప్పుడూ ఎత్తి చూపేదానిని. హైటెక్ సిటీ పై 15 ఏళ్ళ ముందే ఆలోచన చేసిన విజనరీ చంద్రబాబు. నా భర్తను నేను ఏనాడు పొగడలేదు. నిరంతరం ఆయన పొరపాట్లు తెలియజేశాను. నా భర్తను అరెస్ట్ చేసిన ఏ కేసులోనూ సాక్షాధారాలు లేవు. నిజంగా అవినీతి జరిగి వుంటే ఆ డబ్బు ద్వారా ఎవరు లబ్దిపొందారో చూపడం లేదు. ఏపి భవిష్యత్తు పై ఏ మాత్రం ఆలోచన లేని వ్యక్తుల చేతిలో పరిపాలన నేడు సాగుతోంది. ఏపీ విభజన అనంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్ళు ఆలోచనలు చేస్తూ.. రోజూ 2, 3 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. చిత్తూరు పర్యటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నా భర్త పై 307 కింద కేసు పెట్టారు. కొందరు వ్యక్తులు శ్రీకాకుళం నుండి కుప్పం వరకు చంద్రబాబుకు సంఘీభావంగా సైకిల్ యాత్ర చేస్తే వారి బట్టలు చింపారు.' అని అన్నారు. ఇదికూడా చదవండి: Health Tips: మీ శరీరంలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే పొరపాటున కూడా విస్మరించకండి.. జీవితాంతం చింతించాల్సి వస్తుంది..! 'టీడీపీ కార్యకర్తలను ఎంత తొక్కితే అంత పేకి లేసి కొడతారనే విషయం మరిచిపోవద్దు. నేడు ఏ కార్యకర్తను కదిలించినా అమ్మా నా పై కేసు వుంది అంటున్నారు. ప్రజలు ఇవాళ బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయకత్వంపై వారికి వున్న నమ్మకం వల్లే. మహిళల కోసం 22 పథకాలు ప్రవేశపెట్టిన నాయకుడు చంద్రబాబు. ఈ రోజు కాకపోయినా రేపు అయినా నిజం గెలవడం ఖాయం. నా భర్త బయటకు రావడం ఖాయం. చంద్రబాబును ఇబ్బందులకు గురి చేస్తే పార్టీని నాశనం చేయవచ్చు అని వైసిపీ భావిస్తుంది. చంద్రబాబు చాలా బలమైన నాయకుడు. ఆయన ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొగల శక్తివంతమైన నేత. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, గంజాయి విచ్చలవిడి అయిపోయింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లోపించింది. ఈ ప్రభుత్వం పై పొరాటనికి వెనుక అడుగు వేయకుండా ముందుకు సాగాలి. నేడు రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో పెట్టి చంద్రబాబును నిర్బంధించామని అనుకుంటున్నారు. కానీ, అది కొంతకాలం మాత్రమే.' అని అన్నారు నారా భువనేశ్వరి. ఇదికూడా చదవండి: అత్యధి మైలేజీ కార్ల కోసం చూస్తున్నారా? బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు మీకోసం.. #ap-news #chandrababu #andhra-pradesh-news #nara-bhuvaneshwari #andhra-pradesh-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి