Srilanka: మరోసారి తెరపైకి రాజపక్స కుటుంబం.. ఈసారి ఎన్నికల్లో పోటీ

2022లో శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం రావడంతో పదవి నుంచి వైదొలగిన రాజపక్స కుటుంబం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ఈ కుటుంబం తమ వారసుడు నమల్ రాజపక్స పేరును ప్రకటించింది.

New Update
Srilanka: మరోసారి తెరపైకి రాజపక్స కుటుంబం.. ఈసారి ఎన్నికల్లో పోటీ

2022లో శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం రావడంతో అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న గొటబాయ రాజపక్స పదవి నుంచి వైదొలిగి దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజపక్స కుటుంబం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈ కుటుంబం తమ వారసుడి పేరును ప్రకటించింది. SPP (శ్రీలంక పొదుజన పెరమున) పార్టీ తరఫున దేశ అధ్యక్ష అభ్యర్థిగా నమల్ రాజపక్స పేరును ప్రతిపాదించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సాగర కరియవసామ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read: వినేష్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు.. రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి

అయితే శ్రీలంక జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో నలుగురి మధ్య గట్టి పోటీ ఉండనుందని పలువురు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న విక్రమసింఘే, విపక్ష నేత సజిత ప్రేమదాస, జీవీపీ నాయకుడు అరుణ కుమార దిశనాయకే ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పుడు ఈ జాబితాలో రాజపక్స కుటుంబ వారసుడు, మహీందా రాజపక్సా కొడుకు నమల్ రాజపక్స చేరారు. మరోవిషయం ఏంటంటే 2022 జులైలో రాజపక్సా కుటంబమే విక్రమసింఘేకు అధ్యక్ష పదవి దక్కేలా సాయం చేసింది. దీంతో ఈసారి జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 21న శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

ఇదిలాఉండగా.. 2022 ఏప్రిల్‌లో శ్రీలంక ప్రభుత్వంలో తీవ్ర సంక్షోభం తలెత్తింది. ఆ దేశానికి అప్పులు విపరీతంగా పెరిగిపోవడం, వాటిని చెల్లించలేక ఇబ్బందులు పడ్డ ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. చివరికి అధ్యక్ష భవనంలోకి ఆందోళనకారులు చొరబడ్డారు. అప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేసి విదేశాలకు పారిపోయారు. దీంతో విక్రమసింఘే అధికారం చేపట్టారు. పరిస్థితులు సద్దుమునిగాక కొన్ని వారాల తర్వాత గొటబాయ మళ్లీ శ్రీలంకలో అడుగుపెట్టారు.

Also Read: విచక్షణ కోల్పోయిన పోలీసులు.. ఒకరిపై ఒకరు కాల్పులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు