Nail Care: మీ గోర్ల సంరక్షణ మీ చేతుల్లోనే..ఎలాగో తెలుసా?

ఎప్పటికప్పుడు గోర్లను కత్తిరించి శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లను సరిగ్గా మెయింటెయిన్ చేయకపోతే వాటి ఆరోగ్యం త్వరగా పాడవుతుంది. గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు, ప్రొటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ ఎ, సి, డి, మాంసం, గుడ్లు, గింజలు ఉండేలా చూసుకోండి.

New Update
Nail Care: మీ గోర్ల సంరక్షణ మీ చేతుల్లోనే..ఎలాగో తెలుసా?

Nail Care: గోర్లను సరిగ్గా మెయింటెయిన్ చేయకపోతే వాటి ఆరోగ్యం త్వరగా పాడవుతుంది. కొందరు బ్యూటీ పార్లర్‌కి వెళ్తేనే గోర్లను రక్షించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే ఇంట్లోనే కూర్చొని గోర్లను సంరక్షించుకోవచ్చు. కొందరు గోర్లను సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఎన్నో సమస్యలు వస్తుంటాయి.

గోర్లు ఎందుకు ఊడిపోతాయి?:

  • కొందరికి కొన్ని సందర్భాల్లో గోర్లు త్వరగా విరిగిపోవడం, ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. గోర్లలో ఎక్కువగా తేమ ఉంటే ఊడిపోతాయి. ముఖ్యంగా కిచెన్ పనులు, గిన్నెలు కడుక్కోవడం, నీళ్లలో పని చేయడం వంటివి చేస్తే గోర్లు తొందరగా ఊడిపోతాయి. అంతేకాకుండా గోర్లలో నీరు చేరడం వల్ల తొందరగా కుళ్లిపోతాయని. అందుకే నీళ్లు లోనికి చేరకుండా జాగ్రత్తలు వహించాలని నిపుణులు అంటున్నారు. పాత్రలు తోమాలంటే గ్లౌజులు వాడాలని సూచిస్తున్నారు.

గోర్లను ఎలా శుభ్రపర్చుకోవాలి?:

  • చాలా మంది గోర్లను నోటితో కొరుకుతూ ఇష్టానుసారం కట్‌ చేస్తుంటారు. మన గోర్లు రెండు వైపులా లేదా ఒకవైపు చిన్న చిప్స్ లాగా రాలిపోతుంటే అవి పాత బడిపోతున్నాయని అర్థం. అందుకే ఎప్పటికప్పుడు గోర్లను కత్తిరించి శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే గోర్లు పొడిబారకుండా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

పోషకాలు:

  • గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. బయోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. అలాగే ప్రొటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ ఎ, సి, డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి. ఆహారంలో మాంసం, గుడ్లు, గింజలు ఉండేలా చూసుకోండి.

గోర్ల ఆరోగ్యం కోసం ఇలా చేయండి:

  • ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో నీటిని తాగాలి. దీనివల్ల గోర్లు ఆరోగ్యంగా మారుతాయి. విరిగిపోయే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఏదైనా వస్తువులను గోర్ల సహాయంతో తెరవడం, ప్రతిసారి గోర్లు నోటితో కొరకడం వల్ల తొందరగా విరిగిపోతాయి. తరచూ నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: టూత్ బ్రష్‌ను బాత్‌రూమ్‌లో ఉంచుతున్నారా?..అయితే డేంజర్‌

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: బక్కగా ఉన్నారని దిగులా? ఈ బ్రెడ్‌తో రెండు వారాల్లో పది కేజీలు గ్యారెంటీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు