Nagababu: వైసీపీ నాయకుల చెంపలు పగలగొట్టండి: నాగబాబు ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులను చొక్కా పట్టుకుని చెంపలు పగలగొట్టండన్నారు జనసేన నేత నాగబాబు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 10 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Janasena Leader Nagababu: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతలు మరింత ముందుకు వెళ్తున్నారు. తాజాగా, జనసేన నేత నాగబాబు అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల దగ్గరకు ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నాయకులను చొక్కా పట్టుకుని చెంపలు పగలగొట్టండి అని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. Also Read: బీ కేర్ ఫుల్.. జనసైనికులకు పార్టీ అధినేత పవన్ హెచ్చరిక..! రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శలు గుప్పించారు. వైసీపీ ఒక బఫూన్ ప్రభుత్వమని.. వీరిపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరికి రాలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రాష్ట్రంగా తయారు చేసిందని వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. గంజాయిలో స్థానిక మంత్రికి వాటాలు ఉన్నాయని నాగబాబు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేస్తామని హామీ ఇచ్చారు. Also Read: జగన్ కుంభకర్ణుడు.. 25 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా?.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న షర్మిల..! కాగా, అనకాపల్లి పార్లమెంట్ టికెట్ నాగబాబుకే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ పార్లమెంట్ పరిధిలో నాగబాబు విసృతంగా పర్యటనలు చేపట్టారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేదానిపై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ-జనసేనల మధ్య గట్టి పోటీ ఉంటోంది. బీజేపీ కూడా టీడీపీ-జనసేనలతో కలవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. #andhra-pradesh #janasena #nagababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి