Nagababu: పదేళ్ల నా కల నెరవేరింది.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్..!

పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలి 'పవన్ కళ్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల అన్నారు కొణిదెల నాగబాబు. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి I feel very thrill అంటూ పోస్ట్ చేశారు.

New Update
Nagababu: పదేళ్ల నా కల నెరవేరింది.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్..!

Nagababu: డిప్యూటీ C.M పవన్ కళ్యాణ్ శాసనసభలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అన్న కొణిదెల నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. "పదేళ్ల కల నెరవేరింది, ప్రజా ప్రస్థానం మొదలైంది.. డిప్యూటీ C.M హోదాలో శాసనసభ లో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. తోడబుట్టిన వాడిగా, జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది.

Also Read: అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు.. భార్య భువ‌నేశ్వరి ఆస‌క్తిక‌ర ట్వీట్..!

పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కి వెళ్లాలి 'పవన్ కళ్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల.. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి I feel very thrill.. మా కుటుంబం అంతా కూటమిలో కళ్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా చాలా సంతోషంగా , గర్వంగా ఉన్నారు.. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటూ తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో,నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను" అంటూ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు