Naga Chaitanya Engagement : 8.8.8 అర్థం ఏంటి..? నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం

అక్కినేని నాగచైతన్య, నటి శోభిత నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9:42 గంటలకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఈ జంటకు నాగార్జున శుభాకాంక్షలు తెలుపుతూ..''8.8.8 అనంతమైన ప్రేమకు నాంది'' అని రాసుకొచ్చారు. 8.8.8 అర్ధమేంటో ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Naga Chaitanya Engagement :  8.8.8 అర్థం ఏంటి..? నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం

Naga Chaitanya - Sobhita : టాలీవుడ్ (Tollywood) హీరో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), నటి శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈరోజు ఉదయం 9:42 గంటలకు వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఈ విషయాన్ని నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున సోషల్ మీడియా (Social Media) వేదికగా ప్రకటిస్తూ.. నిశ్చితార్థ వేడుకల ఫొటోలను షేర్ చేశారు. నాగార్జున తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు.. "మా కొడుకు నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు తెలియజేయడం మాకు సంతోషంగా ఉంది. శోభితను మా కుటుంబంలోకి స్వాగతించేందుకు సంతోషిస్తున్నాము. సంతోషకరమైన జంటకు అభినందనలు. వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది❤️"అని రాశారు.

publive-image

8.8.8 అర్థం ఏంటి..?

అయితే ఈ పోస్ట్ లో 8.8.8 అంటే ఏంటి అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మొదటి 8 ఈరోజు డేట్, రెండవ 8 ఈ నెలను సూచిస్తుంది. ఇక చివరి 8 ఏంటి అని ఆలోచిస్తున్నారు. 2024(2+0+2+4) కలిపితే 8 వస్తుంది. అలా లక్కీగా భావించి 8.8.8 అని పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: Tollywood: మంచు మనోజ్, నాగ చైతన్యతో పాటు రెండో పెళ్లి చేసుకున్న సెలెబ్రెటీలు వీళ్ళే .. - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరింతగా ఉంది. యాక్షన్, రొమాన్స్, సాంగ్స్ ఇలా ప్రతి విషయంలోనూ కట్ చేసిన ట్రైలర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

New Update
Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram | Vijayashanti

Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram

నందమూరి కల్యాణ్‌రామ్‌, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన కొత్త సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. సయీ మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌‌గా నటిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ అందించారు.

ట్రైలర్ అదుర్స్

ఇవాళ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ట్రైలర్ అదిరిపోయింది. టైటిల్‌కు తగ్గట్లుగా తల్లీకొడుకుల అనుబంధానికి ఎంతో ప్రాధాన్యమున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. 

(Arjun Son Of Vyjayanthi)

Advertisment
Advertisment
Advertisment