Mysterious Cities: ఈ దేశాల్లో చావు మాట వినిపించకూడదు.. రోగం కనిపించకూడదు.. 

ప్రపంచంలో చాలా వింత కట్టుబాట్లు ఉన్న ప్రదేశాలు చాలానే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో చనిపోవడం కూడా నేరమే. జబ్బు పడటం కూడా తప్పే. అలంటి నగరాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి అటువంటి నగరాలూ ఏవో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

New Update
Mysterious Cities: ఈ దేశాల్లో చావు మాట వినిపించకూడదు.. రోగం కనిపించకూడదు.. 

Mysterious Cities: ప్రపంచం అంటేనే వింతల పేటిక. ఎంత తెల్సినా.. ఎన్ని చూసినా.. ఎదో ఒక మూలన మనల్ని ఆశ్చర్యపరిచే వింత కనిపిస్తుంది. అన్నీ తెలుసుకోవడం కష్టం. కానీ, ఇలా అప్పుడప్పుడు తెలిసే విషయాలను విని ఆశ్చర్యపోవడం మనవంతుగా మారుతుంది. చాలా ఊర్లు చూసి ఉంటారు మీరు. ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో తిరిగి ఉండవచ్చు. మీరు వెళ్లిన ప్రాంతాల్లో ఎక్కడా ఇలాంటి వింత ఆచారం ఉన్న ప్రదేశాలు మీకు తగిలి ఉండవు. అంత కచ్చితంగా ఎలా చెబుతన్నామని అనుకోవద్దు. ఈ విషయాలను వింటే.. ఈ ప్రాంతాల గురించి తెలుసుకుంటే కచ్చితంగా ఇది కరెక్ట్ అని అంటారు మీరు కూడా. అంతేకాదు విన్నతరువాత షాక్ కూడా అవడం గ్యారెంటీ. 

ప్రపంచంలో చనిపోవడం, జబ్బు పడడం కూడా నిషేధించిన ప్రదేశాల (Mysterious Cities) గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఇది నిజంగా నిజం. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాలలో ఒకటి.

ప్రపంచంలోని ఈ ప్రదేశాల గురించి టూరిస్టులుగా లోకాన్ని చుట్టేస్తూ సంచరించే వారికి కూడా తెలియదు. నిజానికి, ఈ స్థలాలు మిస్టరీ కంటే తక్కువ కాదు. ఈ ప్రదేశాల గురించి తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఇక్కడికి వెళ్లాలని అనిపించవచ్చు…

సెలియా, ఇటలీ
ఒకప్పుడు, ఇటలీలోని (Italy) ఈ చిన్న పట్టణం సెలియాలో (Celia) చాలామంది నివసించేవారు. ఇప్పుడు సెలియా జనాభా దాదాపు 500 మంది మాత్రమే. ఇలా నగరంలో జనాభా తగ్గిపోవడం మొదలైనపుడు ఆ నగర మేయర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితిలోనూ నగరంలో ఎవరో ఓచనిపోకూడదని అనుకున్నాడు. అందుకే.. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాడు. అక్కడ ఎవరూ అనారోగ్యం పాలు కాకుండా చేశాడు. ఇక అక్కడ ఎట్టి పరిస్థితిలోనూ ఎవరూ చనిపోకూడదు. చనిపోయే పరిస్థితి వస్తే నగరం బయటకు తీసుకుపోవడం చేస్తారు. అక్కడ టూరిస్టులు ఎవరైనా వెళ్లినా కూడా వారు కూడా ఎటువంటి పరిస్థితిలోనూ ఈ రూల్ పాటించాల్సిందే.  ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే.. వారికి 10 యూరోల జరిమానా విధిస్తారు. 

Also Read: గూడ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. కేవలం అందుకోసమే.. దీని స్పెషాలిటీస్ ఇవే!

కాగ్నోక్స్, ఫ్రాన్స్ (France)
ఈ ఫ్రెంచ్ నగరం యొక్క కథ చాలా ఆశ్చర్యకరంగ ఉంటుంది. అది 2007 సంవత్సరం. ఆ ఊరి మేయర్ నగరంలో శ్మశానవాటికను నిర్మించాలని అనుకున్నాడు. కానీ, దానికి వీలు పడలేదు. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు. దీని తరువాత, అతను ఇక్కడ ప్రజల మరణాలను నిషేధించాడు. ఇప్పటికీ ఈ నగరంలో మరణించడం నేరంగా చూస్తారు. 

ఇట్సుకుషిమా, జపాన్
ఇది జపాన్‌లోని (Japan) అత్యంత పవిత్రమైన ద్వీపం. ఈ ద్వీపంలో నివసించే ప్రజలు షింటోబాద్‌ను నమ్ముతారు. ఈ ప్రజలు ఈ ద్వీపం పవిత్రత విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. ఇక్కడ పుట్టడం లేదా చనిపోవడం అనుమతించరు. వాస్తవానికి, ఈ నియమం 1878 సంవత్సరం నుండి అమలులో ఉంది. నేటికీ ఇక్కడి ప్రజలు ఈ నిబంధనను కచ్చితంగా పాటిస్తారు. 

Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు