Abhinav : అత్యాసలేని 'మై డియర్ దొంగ'.. అందరికీ కనెక్ట్ అవుతుందట!

'మై డియర్ దొంగ' మూవీ టీమ్ విశాఖలో సందడి చేసింది. ఏప్రిల్ 19 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుండగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. దొంగగా నటించిన అభినవ్ తాను చాలా క్లారిటీ వున్న దొంగ అన్నారు. అత్యాసలేకుండా అవసరాల కోసం మాత్రమే దొంగతనాలు చేస్తానని చెప్పి అలరించాడు.

New Update
Abhinav : అత్యాసలేని 'మై డియర్ దొంగ'.. అందరికీ కనెక్ట్ అవుతుందట!

My Dear Donga : అభినవ్ గోమటం(Abhinav Gomatam), నిఖిల్ షాలిని(Nikhil Shalini), దివ్య శ్రీపాద(Divya Sripada) నటించిన మై డియర్ దొంగ మూవీ టీమ్ మంగళవారం విశాఖలో సందడి చేసింది. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్ లో జరిగిన మీడియా సమావేశంలో హీరో అభినవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఈనెల 19 న విడుదల అవుతుందని చెప్పారు. మంచి కంటెంట్ వున్న చిత్రం ఇది. ఇందులో తాను దొంగగా నటించాను అని చెప్పారు. చాలా క్లారిటీ వున్న దొంగ అన్నారు. అత్యాస లేకుండా అవసరాల కోసం మాత్రమే దొంగతనాలు చేస్తానని చెప్పారు. గతంలో మంచి దొంగ, అడవి దొంగ, జేబు దొంగ సినిమాలు వచ్చాయి అని గుర్తు చేశారు.

అందరికీ ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది..
హీరోయిన్ షాలిని మాట్లాడుతూ, ఇందులో నిఖిల్ బాయ్ ప్రెండ్ పాత్ర, అభినవ్ దొంగ పాత్రలో కనిపిస్తారు. ఎవరైనా ఎలాగైనా వుండొచ్చు అన్నట్టు చూపించాం అన్నారు. కాబట్టి, అందరికీ ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది అన్నారు. దివ్య శ్రీపాద మాట్లాడుతూ, వేసవి(Summer) లో పన్నీటి జల్లు వంటి సినిమా అన్నారు. మంచి సందేశం కూడా వుంటుంది అన్నారు. యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. బాయ్ ప్రెండ్ మాత్రమే లోకం అన్నట్టుగా వుండే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను అని పేర్కొన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ, ఇందులో తాను బాయ్ ప్రెండ్ పాత్ర పోషించాను అన్నారు.

ఇది కూడా చదవండి: Aishwarya: రజనీకాంత్ కూతురు, అల్లుడికి ఫ్యామిలీ కోర్టు నోటీసులు!

ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్..
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్(Romantic Comedy Entertainer) గా తెరకెక్కిన ఈ సినిమాకు బి.ఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాలిని కొండెపూడి కథానాయికగా నటించగా.. దివ్య శ్రీపాద కీలకపాత్రలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ నవ్వులు పూయించింది. అయితే ఈ సినిమాను అటు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. “ఎక్కడి దొంగలు అక్కడే ఉండండి.. ఎందుకంటే అసలైన దొంగ ఏప్రిల్ 19న వస్తున్నాడు” అంటూ క్యాప్షన్ ఇస్తూ మై డియర్ దొంగ మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు