Rahim: టెస్టు క్రికెట్‌లో తొలి బంగ్లా బ్యాటర్.. విచిత్రంగా ఔటైన స్నేక్ డ్యాన్సర్..! వీడియో! బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతను బంతిని హ్యాండిల్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ ప్లేయర్లు అప్పీల్ చేయగా.. రహీమ్‌ను 'అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్'గా అంపైర్ ఔట్ ఇచ్చారు. By Trinath 06 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి క్రికెట్‌లో అవుట్ అంటే వెంటనే గుర్తొచ్చిది బౌల్డ్, క్యాచ్, LBW, స్టంప్ అవుట్, రన్ అవుట్. క్రికెట్ చాలా కాలంగా చూసేవారికి కూడా అవుట్ ఇచ్చే రకాలు ఎన్నో తెలియకపోవచ్చు. కొంతమందికి మాత్రం తెలుసు. MCC క్రికెట్ లా హ్యాండ్ బుక్ కొంతమంది దగ్గర ఉంటుంది. వారికి వివిధ రకాల అవుట్స్‌పై అవగాహన ఉంటుంది. ఆ మధ్య ఐపీఎల్‌లో యూసఫ్ పఠాన్ ఉద్దేశపూర్వకంగా ఫీల్డ్‌ను అడ్డుకుంటే అవుట్ ఇచ్చారు. 20ఏళ్ల క్రితం పాకిస్థాన్ లెజెండరీ బ్యాటర్ ఇంజిమామ్ ఉల్ హక్‌కు కూడా ఇలానే అవుట్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం మిర్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్(Mushfiqur Rahim) విచిత్రంగా ఔటయ్యాడు. Mushfiqur Rahim becomes the first Bangladesh player to be dismissed for handling the ball.pic.twitter.com/cMdWVcNpNt — CricTracker (@Cricketracker) December 6, 2023 తొలి బంగ్లా బ్యాటర్: ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్(Bangladesh) క్రికెట్ చరిత్ర పుస్తకాలలో మరో కొత్త పేజీలో స్థానం సంపాదించాడు. అది కూడా రాంగ్ రీజన్స్‌తో. మిర్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు తొలి రోజులో రహీమ్ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్(Obstructing the Field) రూపంలో అతడిని ఔట్‌గా అంపైర్లు ప్రకటించారు. తొలి టెస్టులో బంగ్లాదేశ్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టు తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఉంది. 41వ ఓవర్‌ను కైల్ జేమిసన్ వేస్తున్నాడు. నాలుగో బంతికి డిఫెన్స్ ఆడిన రహీమ్ అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ గా ఔట్ అయ్యాడు. డిఫెన్స్ చేసిన బంతి వికెట్లను తాకుతుందనే భయంతో రహీమ్ బాల్‌ను హ్యాండ్‌తో టచ్ చేశాడు. ఇది MCC క్రికెట్ నిబంధనల ప్రకారం ఔట్. డిఫెన్స్ ఆడిన వెంటనే బౌన్స్ అయ్యి వికెట్లను తాకుతుందనే భయంతో రహీమ్ బాల్‌ను చేత్తో పక్కకు నెట్టేయడంతో బౌలర్లు అప్పీల్ చేశారు. దీంతో నిబంధనల ప్రకారం అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ఇప్పటికీ పదిసార్లు: అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పద్ధతిలో ఇప్పటివరకు పది మంది ఇలా ఔట్ అయ్యారు. టెస్ట్ క్రికెట్‌లో ఏడు సందర్భాలలో, వన్డే ఇంటర్నేషనల్స్‌లో మూడు సార్లు ఇలా ఔట్ అయ్యారు . దక్షిణాఫ్రికా ఆటగాడు రస్సెల్ ఎండియన్ 1957లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఔట్ అయినప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పద్ధతికి ఔటైన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. అయితే గతంలో హ్యాండ్లింగ్ ది బాల్‌ని దీనికి సపరేటు పేరు ఉండేది. తర్వాత అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కేటగిరిలో దీన్ని కలిపేశారు. ఇలా రూల్‌ను రీబ్రాండ్ చేసిన తర్వాత ఔటైన తొలి ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్. Also Read: అఫ్ఘాన్ తోపునే పక్కకు తోసేసిన టీమిండియా మొనగాడు.. నంబర్-1 బౌలర్ ఇక్కడ! WATCH: #cricket #cricket-news #mushfiqur-rahim మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి