Viral Video: ప్యార్ హువా ఇక్రార్ హువాకి అంటూ ప్రీ వెడ్డింగ్ లో అంబానీ దంపతుల అదిరిపోయే డ్యాన్స్...!!

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల రెండు కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా షురూ అయ్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖేశ్, నీతా అంబానీ రిహార్సల్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.

New Update
Viral Video: ప్యార్ హువా ఇక్రార్ హువాకి అంటూ ప్రీ వెడ్డింగ్ లో అంబానీ దంపతుల అదిరిపోయే డ్యాన్స్...!!

Anant's pre-wedding celebrations : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, అతని భార్య నీతా తమ కుమారుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు సాగే ఈ వేడుకల్లో ఐదు ఈవెంట్‌లు ప్లాన్ చేశారు. కాగా ఈ వైరల్ వీడియోలో ముఖేష్, నీతా అంబానీ రాజ్ కపూర్ ఐకానిక్ 1955 పాట 'ప్యార్ హువా ఇక్రార్ హువా హై'పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ ఇరగదీశారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జులైలో పెళ్లి చేసుకోనున్నారు. మార్చి 1 నుండి మార్చి 3 వరకు జరిగే వారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు సాగుతాయి. కాగా, జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో ఫిబ్రవరి 29న 'అన్న సేవ' కార్యక్రమం జరిగింది. అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దాదాపు 1,000 మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే సహా పలువురు భారతీయ ప్రముఖులు ఇప్పటికే జామ్‌నగర్‌లో ఉన్నారు. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ,బిల్ గేట్స్, మెలిండా గేట్స్ కూడా హాజరయ్యారు. గ్లోబల్ పాప్ ఐకాన్ రిహన్నా ఫిబ్రవరి 29న జామ్‌నగర్‌కు చేరుకోవడం ఈ ఈవెంట్ అతిపెద్ద హైలైట్స్ లో ఒకటి.

ఇది కూడా చదవండి: పింక్ గౌనులో బార్బీ డాల్ లా మెరిసిన ఇషా అంబానీ..!

Advertisment
Advertisment
తాజా కథనాలు