MS DHONI: ధోనీ డీజిల్ ఇంజన్ లాంటివాడు..ఏబీ డివిలయర్స్!

భారత మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్  ధోనీ డీజిల్ ఇంజన్ లాంటివాడని, అది ఎప్పటికీ ఆగదని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కొనియాడారు.

New Update
MS DHONI: ధోనీ డీజిల్ ఇంజన్ లాంటివాడు..ఏబీ డివిలయర్స్!

IPL 2024: భారత మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్  ధోనీ డీజిల్ ఇంజన్ లాంటివాడని, అది ఎప్పటికీ ఆగదని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభివర్ణించారు.

భారత్ క్రికెట్ కు ఇప్పటి వరకు నాలుగు వరల్డ్  కప్పులు అందించిన సారథిగా ఎంఎస్ ధోనీ నిలిచాడు. క్రికెట్ లో ధోనీ అరంగ్రేటం చేసిన తర్వాత ఒక నవశకాన్ని తీసుకువచ్చాడు. మాజీ లు బ్యాటింగ్ ఆడుతున్నప్పటికి ఫీల్టింగ్ లో వీక్ గా ఉన్నారని చాలా మంది మాజీలను అతను టీం నుంచి తప్పించాడు. జట్టులో అవకాశం కావాలంటే ఫీల్డింగ్ లో చురుకుగా ఉన్నవారికి  జట్టులో అవకాశం ఉంటుందని యువ క్రికెటర్లకు  తెలియజేశాడు.కురాళ్లకు అవకాశాలు ఇస్తూ స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా తన మార్క్ ను చూపించి టీమిండియా కు అనేక విజయాలను అందించాడు.

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు ఇప్పటి వరకు ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు జట్టును 5 సార్లు విజేతలుగా నిలిపాడు. 2019 వరల్డ్ కప్ ఓటమి తర్వాత ధోనీ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ లో ధోనీ ఆడుతూ తన అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. కాని కొన్నిసీజన్లకు ముందే తాను ఐపీఎల్ కు రిటైడ్ మెంట్ ప్రకటిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ 2024కి ఫిట్‌గా ఉండేందుకు ఎంఎస్ ధోనీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. శస్త్ర చికత్స అనంతరం ఐపీఎల్ లో ధోనీ భవిష్యత్తుపై ఊహాగానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీ నాయకత్వం వహించనున్నాడు.

దక్షిణాఫ్రికా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ బ్యాట్స్‌మెన్ ఎ.బి. డివిలియర్స్ ధోనీ నీ ప్రశంసించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోనీ ని డీజిల్ ఇంజిన్‌తో పోల్చాడు. ప్రముఖ టీ20 లీగ్ ఐపీఎల్ లో  42 ఏళ్ల వయసులో కెప్టెన్ గా అద్భుతంగా     రాణిస్తున్నాడని ఏబీడీ కొనియాడారు.

ఇదే అతని చివరి సీజన్ అవుతుందా? ఎవ్వరికి తెలియదు. అతను ఈ డీజిల్‌లాగా ఎప్పటికీ అయిపోడు. అతను పరుగు కొనసాగిస్తున్నాడు. " అద్భుతమైన ఆటగాడు, ఎంత అద్భుతమైన కెప్టెన్," అని ఏబీడీ అన్నారు.

.

Advertisment
Advertisment
తాజా కథనాలు