Crime: ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు డిస్ట్రబ్‌ చేశాడని..కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి!

ఫోన్‌ లో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చాడని కన్నబిడ్డనే గొంతునులిమి చంపేసింది ఓ కసాయి తల్లి. ఈ విషాద ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అఫ్సానా అనే మహిళ ఫోన్‌ లో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చాడని రెండేళ్ల బిడ్డని గొంతు నులిమి చంపేసింది.

New Update
Crime: ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు డిస్ట్రబ్‌ చేశాడని..కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి!

Jharkhand woman kills 2-yr-old son: ప్రపంచంలో అత్యంత భద్రత, ప్రేమ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కన్నతల్లి అనే చెప్పవచ్చు. అమ్మ  (Mother) దగ్గర ఉంటే భరోసా..ఏ బూచోడు మనల్ని ఏం చేయలేడు అనే నమ్మకం పిల్లలకి ఉంటుంది. కానీ ఆ తల్లే తమ పాలిట యమదూత అవుతుందని కొందరు చిన్నారులు తెలుసుకోలేకపోతున్నారు.

కొందరు క్షణకాలం సుఖం కోసం కన్నబిడ్డలను చిదిమేస్తుంటే..మరికొందరు తల్లులు కనీసం తమ బిడ్డను పొట్టన ఎందుకు పెట్టుకుంటున్నారో కూడా వారికే తెలియకుండా పోతుంది. ఏదో సినిమాలో రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావంటే..తల్లిదండ్రులను , భార్య బిడ్డలను, బంధుమిత్రులను అందర్ని విడదీస్తాను అని చెప్పిందనే డైలాగ్‌ గుర్తుండే ఉంటుంది.

కానీ ఇక్కడ మాత్రం ఓ చిన్నారి చావుకు మొబైల్‌ (Mobile)  ఫోన్‌ కారణం అయ్యింది. ఆ చిన్నారి తల్లి ఫోన్‌ లో మాట్లాడుతున్న సమయంలో ఏడ్చాడన్న కోపంతో గొంతు నులిమి చంపేసింది ఓ మహనుభావురాలు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌ (Jharkhand) లోని గిరిదాహ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అఫ్సానా ఖాతూన్‌ కు ఆరు సంవత్సరాల క్రితం నిజాముద్దీన్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది.

Also read: నటి జయప్రద మిస్సింగ్‌ ..వెతుకుతున్న పోలీసులు!

వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరికి నాలుగు సంవత్సరాలు కాగా,మరో బాబుకి రెండు సంవత్సరాలు. కాగా రెండు రోజుల క్రితం భార్యభర్తలకు గొడవ జరిగింది. ఈ క్రమంలోనే అఫ్సానా చిన్న బాబును తీసుకుని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అయితే ఈ క్రమంలోనే ఆమె తన స్నేహితురాలు ఒకరికి ఫోన్‌ చేసి జరిగిన గొడవ గురించి వివరిస్తుంది.

ఆ సమయంలో ఆమె పక్కన ఉన్న చిన్న బాబు ఏడవడంతో రెండు మూడు సార్లు ఊరుకోబెట్టింది..కానీ మరోసారి కూడా ఏడ్వడంతో విచక్షణా కోల్పోయి బిడ్డ గొంతు నులిమి చంపేసింది. చాలా సేపటి వరకు తలుపు తీయకుండా లోపలే ఉండిపోయింది. చీకటి పడిన తరువాత తలుపు తీసి భర్తను గదిలో నిద్రించడానికి పిలిచింది.

గది లోపలికి వచ్చిన భర్త బిడ్డ కదలకుండా ఉండేసరికి అనుమానం వ్యక్తం చేశాడు. అయితే బాబు పడుకున్నాడని అబద్ధం చెప్పింది. కానీ భర్తకు బాబు లో ఎలాంటి కదలికలు లేకపోవడంతో అనుమానం వచ్చి చూడగా బాబు శరీరం మొత్తం చల్లబడిపోయి ఉంది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించాడు.

అక్కడ బాబుని పరీక్షించిన వైద్యులు బాబు చనిపోయినట్లు తెలిపారు. దీంతో నిజాముద్దీన్‌ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అఫ్సానా మీద కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోనికి తీసుకోగా..అఫ్సానా నేను కావాలని బిడ్డను చంపలేదని..ఏడుస్తున్నాడన్న కోపంతో తోయగా..మంచం మీద నుంచి కిందపడి చనిపోయాడని తెలిపింది.

కానీ బిడ్డ గొంతు నులిమినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన గురించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు..కన్న తల్లి అనే పదానికే కళంకం తీసుకు వచ్చిందని అఫ్సానా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment