Polar bear: అమ్మప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఎలుగుబంటి వీడియో వైరల్! ఓ ధ్రువపు ఎలుగుబంటి నీటిలో మునిగిపోతున్న తన బిడ్డను కాపాడిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వీక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది. By srinivas 04 Mar 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Video viral: ఓ ధ్రువపు ఎలుగుబంటి నీటిలో మునిగిపోతున్న తన బిడ్డను కాపాడిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బండలపై నుంచి అనుకోకుండా నీటిలో పడిపోయిన చిన్నప్రాణినికి (Polar bear) ఈదడం రాదు. దీంతో వాటర్ లో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. నీటినుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంది. కానీ పైకి రాలేకపోతుంది. అయితే అక్కడే పక్కన బిడ్డను కాచుకుని చూస్తున్న తల్లి మెరుపు వేగంతో నిటీలో దూకి పిల్లను ఒడ్డుకు చేర్చింది. Mother Polar Bear dives into pool to save her cub from drowning…and even teaches it how to climb to safety pic.twitter.com/ebpXqTvRN4 — Gabriele Corno (@Gabriele_Corno) February 12, 2024 ఇది కూడా చదవండి: AP Elections 2024: అకౌంట్స్ అన్నీ సెటిల్ చేస్తాం.. జగన్ కు చంద్రబాబు వార్నింగ్! ఈ మేరకు ట్విట్టర్ వేదికగా @Gabriele_Corno అనే వినియోగదారు దీనిని నెట్టింట పోస్ట్ చేయగా 13-సెకన్ల క్లిప్ క్షనాల్లో వైరల్‌గా మారింది. గంటల వ్యవధిలోనే 115,000 వీక్షణలను పొందింది. ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల నుంచి భావోద్వేగాలను రేకెత్తించింది. అమ్మప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. #video-viral #drowning #polar-bear #rescues మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి