/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Mother-and-son-who-were-going-on-a-bike-were-chased-and-attacked-with-hunting-knives-jpg.webp)
శ్రీసత్యసాయి జిల్లా (Sri Sathya Sai District)లో ద్విచక్రవాహనంపై వెళ్తున్న తల్లీ కుమారులపై కొంతమంది దుండగులు దాడి చేశారు. అగలి మండటం పి. బ్యాడిగెర సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట కారులో వచ్చిన దుండగులు కొడికొండ- సిరా జాతీయ రహదారిపై తల్లి మంగళమ్మ, కుమారుడు మారుతి కోసం కాపు కాశారు. ఇది గమనించిన ఇద్దరూ.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో దుండగులు కారులో వెంబడించి వేట కొడవళ్లతో వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఇది కూడా చదవండి: పాదాల నుంచి వచ్చే వాసన పోవడానికి సింపుల్ చిట్కా.. ఆ ఆకులతో ఇలా చేస్తే చాలు
ఉల్లేర గ్రామ సమీపం వరకు సుమారు కిలోమీటర్ మేర తల్లీ కుమారులను దుండగులు వెంబడించారు. అనంతరం వారిని వదిలేశారు. అక్కడ నుంచి తప్పించుకున్న బాధితులు మంగలమ్మ, మారుతి స్థానిక ఎస్సై లావణ్యకు సమాచారమిచ్చారు. పోలీసు సిబ్బంది ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని.. వారిని సిరా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇలాంటి దాడులకు భయపడను: అంబటి
రెండు రోజుల క్రితం పల్నాడు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరంలో వ్యక్తి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. పాత కక్షలతో కూనిరెడ్డి కృష్ణారెడ్డి అనే వ్యక్తిని వేట కొడవళ్లతో గుర్తుతెలియని ప్రత్యర్థులు నరికేశారు. గ్రామానికి చెందిన పరమేశ్వరరెడ్డికి, కృష్ణారెడ్డికి గతంలో పాత గొడవలు నడుస్తున్నాయి. అయితే.. ఊరు వదిలి హైదరాబాద్‌లో కృష్ణారెడ్డి జీవిస్తున్నాడు. కాగా.. దసరా పండక్కి స్వగ్రామం వచ్చిన కృష్ణారెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు. ఘటనపై డీఎస్పీ పల్లపురాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.