TTD : శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే వారికి అధిక ప్రాధాన్యత టీటీడీ ఈవో!

తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు ఇక నుంచి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు ఇతర జంతువుల సంచారాన్ని గుర్తించేందుకు మరికొన్ని ట్రాప్​ కెమరాలను ఏర్పాటు చేయాలన్నారు.

New Update
TTD : శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే వారికి అధిక ప్రాధాన్యత టీటీడీ ఈవో!

Importance Of Tirumala Walking Piligrims : తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు (Devotees) ఇక నుంచి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ (TTD) ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి పద్మావతి గెస్ట్‌ హౌస్‌ లో జరిగిన సమావేశంలో కాలిబాట భక్తుల భద్రతా చర్యలపై ఈవో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజనీరింగ్, భద్రత విభాగాల అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు ఇతర జంతువుల సంచారాన్ని గుర్తించేందుకు ఇప్పుడున్న ట్రాప్​కెమెరాలతో పాటు మరికొన్ని ట్రాప్​ కెమరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఏడవ మైలు వరకు జంతువుల కదలికలను ఎప్పటి కప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని ఇంజనీరింగ్​ అధికారులకు ఈవో ఆదేశాలు జారీ చేశారు. జంతువుల కదలికలపై సమాచారాన్నిఎప్పటికప్పుడు భద్రత విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు చాలా ఖర్చుతో కూడుకున్నందున.. తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను ... ప్రత్యామ్నాయ మార్గాలను సూచించవలసిందిగా కమిటీ వారికి వారికి లేఖ రాయాలని అధికారులకు తెలిపారు.

Also read: హైదరాబాద్‌ లో భారీ వర్షం..మరో నాలుగు రోజులు ఇలాగే!

Advertisment
Advertisment
తాజా కథనాలు