BIG BREAKING: భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. బాధితుడికి ఎంపాక్స్‌ వేరియంట్‌ అయిన క్లేడ్‌ 2 సోకినట్లు పేర్కొంది.

New Update
BIG BREAKING: భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఆఫ్రీకా నుంచి ఇండియాకు వచ్చిన ఓ వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఆ తర్వాత అతడిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించామని.. వైరస్‌ లక్షణలా ఉన్నాయా ? లేవా ? అని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే తాజాగా ఆ వ్యక్తికి ఎంపాక్స్‌ లక్షణాలు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది.

అయితే బాధితుడికి ఎంపాక్స్‌ వేరియంట్‌ అయిన క్లేడ్‌ 2 సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 2022 జులైలో ఇండియాలో 30 కేసులు నమోదయ్యాయని.. ఇప్పుడు వచ్చిన కేసు కూడా అలాంటిదే అని చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ వైరస్‌కు ఇప్పుడు నమోదైన క్లేడ్‌ 2 వైరస్‌కు సంబంధం లేదని తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ ఎంపాక్స్‌ క్లేడ్ 1ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు స్పష్టం చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు