గుడ్‎న్యూస్.. 8.5 కోట్లమంది రైతులకు మోదీ కానుక...నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు జమ..!!

రైతులకు గుడ్ న్యూస్...నేడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేయనున్నారు. ఇవాళ రాజస్థాన్లోని సికార్ లో మోదీ డీబీటీ ద్వారా దేశంలోని 8.5కోట్ల మంది రైతులకు అకౌంట్లలోకి సుమారు రూ. 17,000కోట్లను బదిలీ చేయనున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ.2.42 లక్షల కోట్లకు పైగా లబ్ధి చేకూరింది.

New Update
గుడ్‎న్యూస్.. 8.5 కోట్లమంది రైతులకు మోదీ కానుక...నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు జమ..!!

publive-image

దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మంది రైతులకు గురువారం శుభవార్త చెప్పనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ప్రధానమంత్రి- కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సుమారు 8.5 కోట్ల మంది రైతు లబ్ధిదారులకు 14వ విడతగా రూ. 17,000 కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేయనున్నారు. నేడు రాజస్థాన్‌లోని సికార్‌లో జరిగే కార్యక్రమంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తాన్ని బదిలీ చేయనున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది. పథకం ప్రారంభించినప్పటి నుంచి లబ్ధిదారులకు బదిలీ చేయబడిన మొత్తం రూ. 2.59 లక్షల కోట్లు దాటుతుందని అంచనా. ఈ ఆర్థిక సహాయం రైతులకు వారి రోజువారీ అవసరాలను తీర్చడానికి, వారి మొత్తం సంక్షేమానికి దోహదపడుతుందని ప్రకటన పేర్కొంది.

2019లో ప్రారంభమైంది :
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-కిసాన్) ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించారు. డిసెంబర్ 2018 నుండి అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) మోడ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలకు సంవత్సరానికి 6వేల రూపాయాల ఆర్థిక ప్రయోజనం మూడు సమాన వాయిదాలలో బదిలీ చేస్తారు. ఇప్పటివరకు ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ.2.42 లక్షల కోట్లకు పైగా లబ్ధి చేకూరింది.

పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రం బహుమతి:
ఈ కార్యక్రమంలో మోదీ 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని (పీఎంకేఎస్‌కే) దేశానికి అంకితం చేస్తారు. దేశంలోని రిటైల్ ఎరువుల దుకాణాలను దశలవారీగా PMKSKగా మారుస్తోంది ప్రభుత్వం. ఈ PMKSKలు రైతులకు వ్యవసాయ-ఇన్‌పుట్‌లు, మట్టి, విత్తనాలు, ఎరువుల కోసం పరీక్ష సౌకర్యాలను అందించనున్నాయి. ఈ కేంద్రాలు రైతులకు అవగాహన కల్పిస్తాయి. అంతేకాదు పలు ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని అందజేస్తాయి, బ్లాక్, జిల్లా స్థాయి అవుట్‌లెట్‌లలో రిటైలర్ల క్రమబద్ధమైన సామర్థ్యాన్ని పెంచుతాయి.

యూరియా గోల్డ్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు :
ఈ కార్యక్రమంలో రైతులకు మరో భారీ బహుమతి అందించనున్నారు మోదీ. నేటి కార్యక్రమంలో సల్ఫర్ కోటెడ్ యూరియా (యూరియా గోల్డ్)ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీనితో పాటు, ONDCలో 1,600 రైతు ఉత్పత్తి సంస్థల ఆన్‌బోర్డింగ్‌ను కూడా ప్రారంభించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు