Modi Govt: మోదీ సర్కార్ కీలక నిర్ణయం...సామాన్యులకు భారీ ఊరట...ధరలకు కళ్లెం పడే ఛాన్స్..!!

సామాన్యులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది కేంద్రంలోని మోదీ సర్కార్. ధర పెంపు ప్రభావం సామాన్యులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాజాగా ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధం విధించింది. ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు.

New Update
PM Modi : ఢిల్లీలో రైతుల నిరసన.. ప్రధాని మోడీ కీలక ట్వీట్

కేంద్రంలోని మోదీ సర్కార్ సామాన్యులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఇప్పటికే ధరల పెంపుతో కొట్టుమిట్టాడుతున్న సామాన్యులకు శుభవార్త చెప్పింది. ధరలు సామాన్యులపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న తరుణంలో మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఊరట కలిగించేలా ఉంది. దీంతో ధరలకు కళ్లెం పడే అవకాశం ఉందని చెప్పవచ్చు.

మోదీ సర్కార్ తాజాగా ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధం విధించింది. ఇది సానుకూలం అంశం. ఎందుకంటే ఇఫ్పటికే మార్కెట్లో ఉల్లిధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం సామాన్యులపై పడుతోంది. ఈ క్రమంలో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సామాన్యులకు మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ధరల పెరుగుదలకు కళ్లెం వేసేందుకు మోదీ సర్కార్ తాజాగా ఉల్లిఎగుమతులపై నిషేధం విధించడంతో 2024 మార్చి వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. దీనిద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచాలని కేంద్రం భావిస్తోంది.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం..ఉల్లిఎగుమతులపై నిషేధం విధించింది. ఉల్లి ఎగుమతి పాలసీని సవరించారు. ఇది వరకు ఫ్రీ స్టేటస్ గా ఉండేది..ఇఫ్పుడు దీన్ని ప్రొహిబిటెడ్ కు మార్చారు. దేశంలో ఉల్లిగడ్డల ధరలు సగటున కేజీకి రూ. 57 పైకి చేరాయి. గతేడాది ఇదే సమయంలో ఉల్లిధరలతో పోలిస్తే..ఈ రేటు దాదాపు 98శాతం ఎక్కువని చెప్పవచ్చు. అంటే ఉల్లి ధరలు భారీ పెరిగాయి. అలాగే ఇదివరకే మోదీ సర్కార్ గోధుమలు, నాన్ బాస్మతి రైస్ ఎగుమతులపై కూడా నిషేధం విధించారు. ఇటివలే మరో నిర్ణయం కూడా తీసుకుంది. కంది పప్పు, మినపపప్పు ధరలను నియంత్రించేందుకు విదేశాల నుంచి భారీగా వీటిని దిగుమతి చేసేందుకు పచ్చజెండా ఊపింది.

కాగా ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు, మినపపప్పు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో వీటి సాగుకూడా తగ్గినట్లు తెలుస్తోంది. అందుకు ప్రభుత్వం రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరగకుండా చూసుకునేందుకు భారీగా దిగుమతి చేసుకోనుంది. భారత ప్రభుత్వం 4లక్షల టన్నుల కంది పప్పును దిగుమతి చేసుకోవాలన్న లక్ష్యం పెట్టుకుంది.

ఇది కూడా చదవండి: నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం…అయితే ఈ కార్డు ఉండాల్సిందే..డౌన్ లోడ్ చేసుకోండిలా..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు