Modi : నేడు ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం..ఆ పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు! ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఏపీలో పర్యటించబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఆయన ప్రచారం అనకాపల్లి జిల్లాలో కూడా సాగుతుంది. ఈ క్రమంలోనే మోదీ రాజమండ్రికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో నిర్వహించనున్న సభలో పాల్గొని ప్రసంగిస్తారు. By Bhavana 06 May 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Elections : మరో వారం రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు(General Elections) జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) సోమవారం ఏపీలో పర్యటించబోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఆయన ప్రచారం అనకాపల్లి జిల్లాలో కూడా సాగుతుంది. ఈ క్రమంలోనే మోదీ రాజమండ్రికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్(Rajahmundry Airport) లో దిగి నేరుగా సభ వేదిక వద్దకు మోదీ వెళ్తారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం విశాఖ జిల్లా అనకాపల్లి కి బయల్దేరాతారు. ప్రధాని మోదీ బహిరంగ సభ కోసం బీజేపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు . ఇక, అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం దగ్గర కూటమి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఈ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించారు. రాజమండ్రి, చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలు విధించారు. వాటిని గమనించి ప్రయాణాలు చేసేవారు ప్రయాణించాలని పోలీసులు, అధికారులు కోరారు. Also read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్..నేడు రెండు రాష్ట్రాలకు వర్షసూచన! #east-godavari #election-campaign #pm-narendra-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి