వయనాడ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మోదీ!

కేరళ వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ,అధికార,ప్రతిపక్ష నేతలు సంతాపం తెలిపారు. మృతి చెందిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రధాని మోదీ ఎక్స్ వేదికలో ప్రకటించారు.

New Update
వయనాడ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మోదీ!

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,ప్రధాని మోదీ,అమిత్ షా,రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, సహాయక చర్యలు విజయవంతం కావాలని ప్రార్థిస్తున్నాను' వారు ఎక్స్ లో తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారం, గాయపడిన వారికి రూ. 50 వేల సాయం అందజేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.కేరళకు అవసరమైన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫోన్‌లో సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Also Read : జగన్ సొంత జిల్లాలో కాల్పుల కలకలం.. వైసీపీ ఇరువర్గాల మధ్య బాహాబాహి..!



Advertisment
Advertisment
తాజా కథనాలు