CM Revanth Reddy: రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది... రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TG: అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ, అమిత్‌ షా బయలుదేరారని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న మోదీ, అమిత్‌ షాపై రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు.

New Update
Malkajgiri: సీఎం రేవంత్ కు బిగ్ షాక్.. సిట్టింగ్ స్థానం గల్లంతు!

CM Revanth Reddy: 18వ లోక్‌సభ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య అని అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కిన రిజర్వేషన్లు కూడా ప్రమాదంలో పడ్డాయని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ, అమిత్‌ షా బయలుదేరారని విమర్శించారు. ఇందిరాగాంధీ తన చివరిశ్వాస విడిచేటప్పుడు తెలంగాణ ఎంపీగానే ఉన్నారని గుర్తు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న మోదీ, అమిత్‌ షాపై రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు. తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు రాహుల్‌కు అండగా నిలిచి రిజర్వేషన్లు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ALSO READ: రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు.. మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

Advertisment
Advertisment
తాజా కథనాలు