Hyderabad: నగర వాసులకు అలర్ట్..ఈ రూట్లలో రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు! హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైళ్ల లో ప్రయాణించేవారికి ఓ ముఖ్య గమనిక.. ఈ నెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, 4 డెమో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. By Bhavana 25 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad MMTS Trains Cancelled: హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైళ్ల లో ప్రయాణించేవారికి ఓ ముఖ్య గమనిక.. ఈ నెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, 4 డెమో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సంబంధించిన ఆధునీకరణ పనుల నేపథ్యంలో , ఫుట్ ఓవర్ బ్రిడ్జిల లాంటి నిర్మాణ పనుల వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. Also Read : మిథాలీ రాజ్‌తో పెళ్లి.. శిఖర్ ధావన్ ఏమన్నారంటే! సికింద్రాబాద్ – ఫలక్‌నుమా, మేడ్చల్ – సికింద్రాబాద్, లింగంపల్లి – మేడ్చల్, హైదరాబాద్ – మేడ్చల్ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్ పీఆర్వో సీహెచ్. రాకేశ్ ఓ ప్రకటనలో వివరించారు. ఇక వీటితో పాటు సిద్దిపేట – సికింద్రాబాద్ ల మధ్య సర్వీసులందించే 4 డెమూ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో కొన్ని రైళ్లను కేవలం రెండు రోజుల పాటు, మరికొన్నింటిని ఒక్కరోజు మాత్రమే సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఆయన వివరించారు. #hyderabad #trains #mmts #cancelled #two-days మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి