MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో షాక్

ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో సీబీఐ, ఈడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది.

New Update
MLC Kavitha: ఢిల్లీ ఎయిమ్స్‌కు కవిత.. కోర్టు కీలక ఆదేశాలు

MLC Kavitha Judiciary Remand Extended: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. జూన్ 3 వరకు ఆమె రిమాండ్ ను పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి కావేరి బవేజా ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కు సంబంధించి సీబీఐ కేసులో నేటితో ఆమె రిమాండ్ గడువు ముగియడంతో జైలు అధికారులు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ విధానంలో హాజరుపర్చారు. ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో సీబీఐ, ఈడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. దీంతో ఆమెకు బెయిల్ వస్తుందా? న్యాయస్థానం ఎలంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో కవితకు బెయిల్ రాకపోతే.. సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ (ED) అరెస్ట్ చేసింది. అనంతరం సీబీఐ సైతం ఇదే కేసులో ఆమెను అరెస్ట్ చేసింది.

Also Read: ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు.. ఎక్కడంటే

Advertisment
Advertisment
తాజా కథనాలు