MLC Kavitha: సీబీఐ విచారణ.. కవితకు కొత్త టెన్షన్! ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించించారు. సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని పిటిషన్ దాఖలు చేశారు. కాగా నిన్న ఈ కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. By V.J Reddy 06 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దరఖాస్తును సీబీఐ అందించలేదని చెప్పారు కవిత తరఫు న్యాయవాది. సీబీఐ కవితను ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. కవిత పిటిషన్‌పై విచారణ ఎప్పుడు జరుపుతామో తరువాత చెప్తామని కోర్టు వెల్లడించింది. కాగా కవిత వేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోరింది. సమయం కావాలి.. కవిత పిటిషన్‌పై కౌంటర్ దాఖలకు సమయం కావాలని కోర్టును కోరింది సీబీఐ. ఏ నిబంధనల ప్రకారం అప్లికేషన్ దాఖలు చేశారో చెప్పాలని సీబీఐ న్యాయవాది కోర్టును కోరారు. కోర్టు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో కవిత పిటిషన్‌పై కౌంటర్ దాఖలకు ఈ నెల 10 వరకు సీబీఐకి సమయం ఇచ్చింది కోర్టు. తదుపరి విచారణను ఈ నెల 10న చేపట్టనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. అసలేమైంది.. లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ ఇచ్చింది సీబీఐ. మద్యం స్కాం కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. అయితే… సీబీఐ వేసిన పిటిషన్ ను అంగీకరించిన కోర్టు.. కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. వచ్చే వారంలో తీహార్ జైలులో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనుంది. కవిత ఇచ్చే వాంగ్మూలాన్నిసీబీఐ నమోదు చేసుకోనుంది. జైలులోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐ కి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. Also Read: 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారు - ఉత్తమ్ #cbi #mlc-kavitha #delhi-liquor-scam-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి