goshamal: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు

బీఆర్ఎస్‌ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తేలిసిందే. అయితే పేదలకు ఇళ్లను కేటాయించే ప్రక్రియను నేడు ప్రారంభించింది కేసీఆర్‌ సర్కార్‌. హైదారబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 11,700 మంది లబ్దిదారులకు ఆన్‌లైన్ డ్రా ద్వారా లబ్దిదారులకు ఇళ్లను ఎంపిక చేశారు. దీన్ని తప్పు పట్టారు ఎమ్మెల్యే రాజాసింగ్.

New Update
goshamal: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది..

తెలగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో ఇళ్లు నిర్మించి.. తాము నిర్మించినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోందని ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఈ విషయాన్ని చెప్పేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు ఆలోచిస్తున్నారు?.. అని గోషామాల్‌ ఎమ్మెల్యే ప్రశ్నించారు. మీ జేబులో నుంచి ఇస్తున్నారా..? మీరేమ్మన్న.. మీ పార్టీ ఫండ్ నుంచి ఇస్తున్నారా..? అని సీఎంను నిలదీశారు. ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులు కానీ వారికి డబుల్ ఇల్లు ఇస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.

సగం మంది నాకు తెలియదు..

తన నియోజకవర్గం గోషామాల్‌లో 500 మందికి డబుల్ బెడ్ రూమ్ కేటాయిస్తే.. అందులో 300 మంది వరకు ఇళ్లు ఉన్నవారే ఉన్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం వాళ్ళకే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు తమాషాలు చేయోదని.. ఇప్పటివరకు ఎన్ని కట్టించారని సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజాసింగ్ నిలదిశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిన ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించనున్నారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మించి అందజేసే కార్యక్రమాన్ని ఈరోజు గోషామాల్ నియోజకవర్గంలో కేటాయించారు. గోషామాల్ నియోజకవర్గంలోని 500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించింది. లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రమేయం లేకుండానే లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్‌లను కేటాయించారు. 500 మందిలో 300 మంది లబ్ధిదారులు నాకు వారు ఎవరో తెలియదన్నారు. కేంద్రం నిధులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోడీ పేరును సీఎం కేసీఆర్, మంత్రులు ప్రజలకు ఎందుకు తెలపడం లేదని మండిపతున్నారు.

ఏం జరిగిందో.. చూడాలి

ఈ విధంగా ఎన్నికల్లో కేసీఆర్‌ సర్కార్‌ లబ్ది పొందాలని చూస్తోందని రాజాసింగ్ విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో విఫలమవడమే కాకుండా.. ఇళ్ల కేటాయింపుల విషయంలో స్వార్ధపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై బీఆర్ఎస్‌ ప్రభుత్వం తీరును విమర్శించడంతో రాజాసింగ్‌ బీజేపీ, బీఆర్ఎస్‌ తరపున పోటీ చేసే అవకాశం లేన్నటు కనిపిస్తోంది. చివరికి స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తారోమో అని అందరూ భావిస్తున్నట్లు సమాచారం. రాజాసింగ్‌ విషయంలో ఏం జరుగుతుందో..!! కొన్ని రోజులు వేచి చూడాలి మరి.

Advertisment
Advertisment
తాజా కథనాలు