MLA Harish Rao: సీఎం రేవంత్‌పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

TG: సీఎం రేవంత్‌పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్లాక్‌మెయిల్లో బడాబాబు రేవంత్ అని విమర్శించారు. దేవుళ్లను మోసం చేసిన చరిత్ర రేవంత్‌ది అని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీని రేవంత్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.

New Update
దమ్ముంటే అమరవీరుల స్థూపం దగ్గరికి రా.. రేవంత్ కు హరీశ్ సంచలన సవాల్

MLA Harish Rao: మీడియాతో చిట్ చాట్ లో హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై విమర్శల దాడికి దిగారు. రేవంత్ చేసేది చిట్ చాట్ కాదు చీట్ చాట్లు అని విమర్శించారు. రేవంత్ మోసాలకు జర్నలిస్టులే సాక్ష్యం అని అన్నారు. అదానీకి పాతబస్తీ విద్యుత్ విషయం లో ఒప్పందం చేసుకున్నాం అన్నాడు..రైతుల్ని మోసం చేస్తున్న గజదొంగ రేవంత్‌రెడ్డి అని అన్నారు. రుణమాఫీ విషయంలో రేవంత్‌ది డ్రామా అని చురకలు అంటించారు.

రుణమాఫీ కాలేదని కొండారెడ్డిపల్లెలో రైతులే బయటకొచ్చి చెప్పారని.. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ (Rythu Runa Mafi) చేస్తామని రేవంత్ చెప్పాడని గుర్తు చేశారు. దేవుళ్లను మోసం చేసిన చరిత్ర రేవంత్‌ది అని ఫైర్ అయ్యారు. బ్లాక్‌మెయిల్లో బడాబాబు రేవంత్ అని అన్నారు. రాహుల్‌ని ఢిల్లీలో తప్పుదోవ పట్టిస్తున్నాడని.. రాహుల్ వస్తానంటే నేనే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి రిసీవ్ చేసుకుంటా అని చెప్పారు. కొండారెడ్డిపల్లె తీసుకెళ్లి రుణమాఫీ కాలేదని నిరూపిస్తా అని అన్నారు. రేవంత్‌ని రాహుల్ వాస్తవాలు అడగాలని అన్నారు.

Also Read: హైడ్రాకు మరిన్ని అధికారాలు.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు